Coffee: ఖాళీ కడుపుతో కాఫీ.. హుషారునిస్తుందా లేక ఆరోగ్యాన్ని చెడగొడుతుందా?

Coffee : ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు ఈ హార్మోన్ స్థాయి ఇంకా పెరిగిపోయి, కారణం లేని కంగారు, చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం వంటి మార్పులు వస్తాయి.

Coffee

చాలామందికి ఉదయం కళ్లు తెరవగానే మొదటి ఆలోచన కాఫీ(Coffee) మీదకే వెళ్తుంది. ఆ వేడి కప్పు కాఫీ తాగితే కానీ ప్రపంచం కనిపించదు, బుర్ర వెలగదు. కానీ మన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసా? మన కడుపు రాత్రంతా ఏమీ తినకుండా ఉండటం వల్ల చాలా సున్నితంగా మారుతుంది.

లోపల జీర్ణక్రియ కోసం సహజంగానే కొంత యాసిడ్ తయారై ఉంటుంది. ఆ సమయంలో మనం నేరుగా కాఫీని లోపలికి పంపితే, అందులోని కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ఒక్కసారిగా పెంచుతుంది.

ఇది కడుపు లోపలి పొరను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మొదట కడుపులో మంట, గ్యాస్, అశాంతి మొదలవుతాయి. ఇది దీర్ఘకాలంలో అసిడిటీ లేదా గ్యాస్ట్రిటిస్ లాంటి పెద్ద జబ్బులకు దారి తీస్తుంది.

Coffee

అంతేకాదు, ఉదయం పూట మనల్ని నిద్ర నుంచి లేపి ఉత్సాహంగా ఉంచడానికి బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనిని సాధారణంగా ఒత్తిడిని పెంచే హార్మోన్ అంటారు.

ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు ఈ హార్మోన్ స్థాయి ఇంకా పెరిగిపోయి, కారణం లేని కంగారు, చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం వంటి మార్పులు వస్తాయి.

దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కూడా అదుపు తప్పుతాయి. అందుకే కాఫీ అలవాటును వదులుకోలేకపోతే, కనీసం కాఫీకి ముందు ఒక గ్లాసు నీళ్లు లేదా ఒక చిన్న పండు తిని చూడండి. అప్పుడు కెఫీన్ నేరుగా కడుపు మీద దాడి చేయదు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version