Jowar roti: మీ ఆరోగ్యం కోసం జొన్నరొట్టెలను ఎందుకు తినాలి?

Jowar roti: జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా, గుండె జబ్బులు ,స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Jowar roti

పూర్వ కాలంలో మన పెద్దలు ఎక్కువగా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు(Jowar roti) వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకునేవారు. అందుకే వారు ఎలాంటి రోగాలు లేకుండా, బలంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు రుచికరమైన, ప్రాసెస్ చేసిన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇలాంటివారు జొన్నరొట్టెలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు నిపుణులు.

జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా, గుండె జబ్బులు ,స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా, జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి , డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఆహార ప్రత్యామ్నాయం. జొన్నరొట్టెలు గ్లూటెన్ ఫ్రీగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది.

జొన్నలు కేవలం ఫైబర్ మాత్రమే కాదు, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్ ,విటమిన్ బి3 వంటి విటమిన్లు, ఖనిజాలు, మరియు మైక్రో న్యూట్రియంట్స్ వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.

Jowar roti

జొన్నరొట్టెలు(Jowar roti) బరువు తగ్గాలనుకునేవారికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది, దీని ద్వారా ఇతర ఆహారాలు తీసుకోవాలని అనిపించదు.

అంతేకాకుండా, జొన్నలు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే అధిక ఐరన్ శాతం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జొన్నరొట్టెలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే, శరీరం అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు ,వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలనుకునేవారు, జొన్నరొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.

Babycorn :బేబీకార్న్.. ఆరోగ్యానికి కొత్త చిరునామా

Exit mobile version