Waterfalls
బిజీ లైఫ్, ఆఫీస్ టెన్షన్లు, సిటీ ట్రాఫిక్.. వీటన్నింటి నుంచి కాసేపు ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే నల్లమల అడవుల వైపు అడుగు వేయండి. తెలంగాణలోని నల్లమల అడవులు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ప్రకృతి ఒడిలో దాగున్న అద్భుతమైన జలపాతాలకు(Waterfalls) కూడా నిలయం. చాలామందికి శ్రీశైలం ,
మల్లెల తీర్థం మాత్రమే తెలుసు. కానీ, నల్లమల గర్భంలో ఎవరికీ తెలియని, జనసంచారం తక్కువగా ఉండే అద్భుతమైన జలపాతాలు(Waterfalls) ఉన్నాయి.
సలేశ్వరం జలపాతం -లోతట్టు ప్రాంతపు అద్భుతం..నల్లమల అడవుల లోపల సుమారు 10 కిలోమీటర్ల వరకూ ట్రెక్కింగ్ చేస్తే తప్ప ఈ జలపాతం(Waterfalls) కనిపించదు. ఇక్కడ సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పడుతుంటే వచ్చే ఆ శబ్దం మనసును పరవశింపజేస్తుంది. అయితే ఇది కేవలం వర్షాకాలం , ఉగాది సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాహస యాత్ర చేయాలనుకునే యువతకు మాత్రం ఇది ఎప్పుడూ బెస్ట్ స్పాట్
లోధ్ జలపాతం -హిడెన్ జెమ్..మన్ననూర్ అటవీ ప్రాంతం నుంచి లోపలికి వెళ్తుంటే ఈ చిన్నపాటి జలపాతం కనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య ఈ నీటి ధారలు చాలా ప్రశాంతతను ఇస్తాయి. వీకెండ్ రైడర్స్ కు ఇది ఒక స్వర్గధామం వంటిది. అంతేకాకుండా ఇక్కడికి వెళ్లే దారిలో రకరకాల వన్యప్రాణులు కూడా కనిపించే అవకాశం కూడా ఉంది.
ఫరహాబాద్ వ్యూ పాయింట్ & జలపాతాలు..టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో ప్రభుత్వం జంగిల్ సఫారీ నిర్వహించడం ప్రధాన ఆకర్షణ. వ్యూ పాయింట్ నుంచి చూస్తే నల్లమల అందాలు కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. వర్షాకాలంలో ఇక్కడ చిన్న చిన్న నీటి పాయలు కాస్తా.. జలపాతాలుగా మారుతాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ తప్పకుండా ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది.
నల్లమల అడవులంటే దట్టమైనవి కాబట్టి, సాయంత్రం 6 గంటల లోపు అటవీ ప్రాంతం నుంచి తిరిగి బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే అడవిలో ప్లాస్టిక్ పారవేయకుండా బాధ్యతగా మెలగాలి. ఆహారం, నీరు వెంట తీసుకెళ్లడం మర్చిపోకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
