Lies:ఎదుటివారి అబద్ధాలను ఎలా కనిపెట్టాలి?

Lies: సైకాలజీ ప్రకారం కొన్ని చిన్న సంకేతాల ద్వారా ఎదుటివారు అబద్ధం చెబుతున్నారని ఇట్టే కనిపెట్టేయొచ్చు.

Lies

మనం రోజుకు ఎంతోమందిని కలుస్తుంటాం..మాట్లాడుతుంటాం. కానీ అందరూ నిజమే చెబుతున్నారని, నిజాలే (Lies) మాట్లాడుతున్నారని నమ్మలేం. అయితే, ఒక వ్యక్తి నోటితో అబద్ధం చెప్పొచ్చు కానీ, అతని శరీరం మాత్రం నిజమే చెబుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. దీనినే ‘నాన్-వెర్బల్ కమ్యూనికేషన్’ అంటారట. సైకాలజీ ప్రకారం కొన్ని చిన్న సంకేతాల ద్వారా ఎదుటివారు అబద్ధం చెబుతున్నారని ఇట్టే కనిపెట్టేయొచ్చని అంటున్నారు.

అబద్ధం చెప్పే వ్యక్తిలో కనిపించే లక్షణాలు

కంటి చూపు (Eye Contact).. సాధారణంగా అబద్ధం(Lies) చెప్పేటప్పుడు మనిషి నేరుగా కళ్లలోకి చూడటానికి ఇబ్బంది పడతారట వారు పదే పదే కళ్లు పక్కకు తిప్పడం కానీ విపరీతంగా కనురెప్పలు ఆర్పడం కానీ చేస్తారట అయితే, కొందరు అతి తెలివైన వారు మాత్రం.. తాము అబద్ధం చెబుతున్నట్లు తెలియకూడదని మరీ ఎక్కువగా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటారట

అనవసరమైన కదలికలు.. అబద్ధం చెప్పేటప్పుడు వారిలో తెలియని ఆందోళన ఉంటుంది. దీనివల్ల వారు పదే పదే ముక్కును తాకడం, మెడను గోకడం లేదా పెదవులను తడుపుకోవడం వంటివి చేస్తారట.

Lies

మాటల్లో తడబాటు.. అడిగిన ప్రశ్నకు డైరక్టుగా సమాధానం చెప్పకుండా, తిప్పి తిప్పి చెప్పడం లేదా అదే ప్రశ్నను మళ్లీ అడగడం అంటే ఆలోచించుకోవడానికి సమయం కోసం వెయిట్ చేయడం చేస్తుంటారట.

చెమటలు పట్టడం..ఏసీ గదిలో ఉన్నా సరే అబద్ధం చెప్పేవారిలో నుదుటిపై లేదా చేతులకు చెమటలు పడుతుంటాయట.

మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనం మోసపోకుండా ఉండొచ్చు. అయితే, ఇవన్నీ కేవలం సంకేతాలు మాత్రమే, పరిస్థితులను బట్టి ఇవి మారొచ్చు అంటున్నారు సైకాలజిస్టులు.

T20 : దంచికొట్టిన ఇషాన్, సూర్యాాభాయ్..రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం

Exit mobile version