Negative Energy
కొన్ని ఇళ్లలోకి వెళ్లగానే మనకు తెలీని ఒక రకమైన బరువు, చికాకు అనిపిస్తుంది. అక్కడ అన్నీ ఉన్నా ప్రశాంతత ఉన్నట్లు అన్పించదు. దీనికి కారణం ఆ ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ(Negative Energy) అంటుంది వాస్తు శాస్త్రం.
వాస్తు దోషాలు కానీ ఇంట్లోని అమరికల వల్ల ఇలాంటి ప్రతికూల శక్తులు(Negative Energy) ఏర్పడతాయని చెబుతోంది. వీటిని గుర్తించి తొలగించుకోవడం వల్ల ఇల్లు మళ్లీ శుభప్రదంగా మారుతుందని సూచిస్తుంది.
నెగటివ్ ఎనర్జీని గుర్తించే లక్షణాలు..ఇంట్లోకి రాగానే అనవసరమైన గొడవలు జరగడం. కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్యం రావడం జరుగుతాయి. ఆర్థికంగా ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి లేకపోవడం, ఏ పనీ పూర్తి కాకపోవడం. ఇంట్లో వెలుతురు ఉన్నా చీకటిగా, నిర్జీవంగా అనిపించడం వంటివి కనిపిస్తాయి.
నివారణ కోసం చిన్న మార్పులు..
1. వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో కొంచెం సముద్రపు ఉప్పు (Sea Salt) వేయాలి. సాల్ట్‌కు ప్రతికూల శక్తులను పీల్చుకునే గుణం ఉంది.
2. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. సాయంత్రం వేళ అక్కడ దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మిని ఆహ్వానించినట్లవుతుంది.అలాగే చిన్న రాగి లేదా ఇత్తడి చెంబులో నిండా నీళ్లు పోసి ఉంచాలి.
3. ఉపయోగించని ఎలక్ట్రానిక్ వస్తువులు, పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు ఇంట్లో ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి.
4. ఈశాన్య మూలలో చిన్న వాటర్ ఫౌంటైన్ కానీ నీటి పాత్రను కానీ, గాజు గిన్నెలో సాల్ట్ వేసి ఉంచడం వల్ల సానుకూల శక్తి (Positive Energy) ప్రవహిస్తుంది.
T20 : దంచికొట్టిన ఇషాన్, సూర్యాభాయ్..రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం
