Home cooking: ఇంటి వంటకు , కుటుంబ బంధాలకు సంబంధం ఉందా?

Home cooking: 1971లో 71% అమెరికన్ కుటుంబాలు భార్య, భర్త, పిల్లలతో కలిసి ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి కుటుంబాలు కేవలం 20% మాత్రమే మిగిలాయి.

Home cooking

వంట అనేది కేవలం ఇంటి పని కాదు, కుటుంబ వ్యవస్థను గట్టిగా కట్టిపడేసే గొలుసు అని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.ఎందుకంటే ఇంటి వంట(Home cooking) తగ్గిపోయి, బయట నుంచి ఆహారం తెప్పించుకునే పద్ధతి పెరిగితే, దాని వల్ల భారీ సామాజిక ఖర్చు (Social Cost) చెల్లించాల్సి వస్తుందని 1980లలో ఆర్థికవేత్తలు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. పిల్లలు, వృద్ధుల సంరక్షణను ప్రభుత్వం, భోజనాన్ని ప్రైవేటు కంపెనీలు చూసుకుంటే కుటుంబ నిర్మాణం బలహీనపడుతుందని వారు ముందుగానే ఊహించారు.

1971లో 71% అమెరికన్ కుటుంబాలు భార్య, భర్త, పిల్లలతో కలిసి ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి కుటుంబాలు కేవలం 20% మాత్రమే మిగిలాయి. మిగతావారు వృద్ధాశ్రమాలకు, ఒంటరి అపార్ట్‌మెంట్‌లకు లేదా విరిగిపోయిన జీవితాలకు పరిమితమయ్యారు. ఈ మార్పుల ఫలితంగా 15% మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు, 12% పురుషులు కుటుంబంలో ఉన్నా ఒంటరిగా ఉంటున్నారు, అలాగే 41% పిల్లలు వివాహేతరంగా పుడుతున్నారు. వివాహ విచ్ఛేదం (విడాకులు) రేటు కూడా భయంకరంగా పెరిగింది (మొదటి పెళ్లిలో 50%, మూడవ పెళ్లిలో 74%).

Home cooking

ఈ పరిణామాలు కేవలం యాదృచ్ఛికం కాదని, వంటగది మూతపడటానికి వచ్చిన సామాజిక మూల్యం అని వ్యాసం స్పష్టం చేస్తోంది. ఇంటి వంట(Home cooking) కేవలం ఆహారం కాదు..అది ప్రేమ, అనుబంధం, ఆత్మీయత. కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడం వలన హృదయాలు దగ్గరవుతాయి, పిల్లలు పెద్దల నుంచి నేర్చుకుంటారు, సంబంధాలు మృదువుగా, ఆప్యాయంగా మారుతాయి. కానీ ప్రతి ఒక్కరూ తమ డివైస్‌లతో ఒంటరిగా తింటే, ఇళ్లు కేవలం విశ్రాంతి గృహాలుగా మారి, కుటుంబాలు సోషల్ మీడియా స్నేహాల్లా అధికారికంగా మారుతాయి.

బయటి ఆహారం తీసుకోవడం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది.. నాసిరకం నూనెలు, కృత్రిమ రుచులు, ఫాస్ట్ ఫుడ్ అలవాటు, ఎక్కువ ఖర్చుతో తక్కువ నాణ్యమైన ఆహారం. దీని ఫలితంగా, యువ వయస్సులోనే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కంపెనీలు మనకు ఏం తినాలో చెబుతుంటే, ఔషధ కంపెనీలు మనల్ని ఆరోగ్యంగా ఉంచే వ్యాపారాన్ని చేస్తున్నాయి.

మన పెద్దలు ప్రయాణంలో కూడా తమ ఇంటి వంట తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి బయట ఆర్డర్ చేయడాన్ని సులభంగా భావిస్తున్నాం. అందుకే, రచయిత హెచ్చరిస్తూ..ఇంకా సమయం ఉంది, కేవలం స్టౌవ్ మాత్రమే కాదు, వంటగదిని వెలిగించండి. అలా చేస్తే, సంబంధాలు, ప్రేమ, భద్రత, సంప్రదాయం, ఆరోగ్యం మళ్లీ పునరుద్ధరించబడతాయి.మొత్తంగా ఒక వంటగది కుటుంబాన్ని కట్టిపడేస్తుంది అనే సందేశాన్ని అందరికీ పంచుతుంది.

Trump: మా రియాక్షన్ కూడా చూస్తారు ట్రంప్ కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

Exit mobile version