Dark Sky Tourism:నక్షత్రాల లోకంలోకి ఒక అద్భుత ప్రయాణం..ఛలో డార్క్ స్కై టూరిజం

Dark Sky Tourism: ఆస్ట్రో-ఫోటోగ్రఫీలో ఆకాశంలోని నక్షత్ర మండలాలు, గ్రహాలను కెమెరాలో బంధిస్తారు.

Dark Sky Tourism

మన నగరాలన్నీ ఇప్పుడు కాంతి కాలుష్యం (Light Pollution) తో నిండిపోయాయి. రాత్రి పూట ఆకాశం వైపు చూస్తే మనకు కొన్ని నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించవు. కానీ, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలున్నాయి, అక్కడ రాత్రి పూట లైట్లు అన్నీ ఆపేస్తారు. అప్పుడు ఆకాశం ఎలా ఉంటుందంటే..కోట్లాది నక్షత్రాలు, పాలపుంత (Milky Way) మన కళ్లముందే స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అనుభూతిని పొందటమే డార్క్ స్కై టూరిజం(Dark Sky Tourism) అంటారు

అయితే దీనిలో ఏముంటుందనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది.

ఆస్ట్రో-ఫోటోగ్రఫీలో ఆకాశంలోని నక్షత్ర మండలాలు, గ్రహాలను కెమెరాలో బంధిస్తారు.
స్టార్ గేజింగ్ (Star Gazing)లో టెలిస్కోపుల ద్వారా ఖగోళ వింతలను చూస్తారు. హాన్లే (లడఖ్) వంటి చోట్ల మన దేశంలోనే మొదటి ‘డార్క్ స్కై రిజర్వ్’ ఏర్పాటు అయింది.
నిశ్శబ్దం -ప్రశాంతతను ఫేస్ చేస్తాము. సిటీ గోలకి దూరంగా, కేవలం ఆకాశం కప్పుకుని పడుకున్న అనుభూతి కనిపిస్తుంది. ఇది మనసులోని ఒత్తిడిని తీసేసి, మనం ఈ విశ్వంలో ఎంత చిన్నవాళ్లమో గుర్తు చేస్తుంది.
పర్యావరణ స్పృహ కలుగుతుంది. కృత్రిమ వెలుతురు వల్ల పక్షులు, జంతువులు పడే ఇబ్బందుల గురించి అవగాహన కల్పించడం కూడా దీనిలో భాగమే.

Dark Sky Tourism

దీనివల్ల లాభం ఏంటంటే.. ఇది కేవలం టూరిజం మాత్రమే కాదు, ఒక మెడిటేషన్ అంటారు దీని గురించి బాగా తెలిసినవారు. విశ్వం గొప్పతనాన్ని చూసినప్పుడు మనిషిలో అప్పటి వరకూ ఉండే అహం తగ్గి, ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందన అంటారు.

Tilak Varma : వార్మప్ లో తిలక్ వర్మ అదుర్స్..యూఎస్ఏపై భారత్ ఏ విక్టరీ

Exit mobile version