New Baggage Rules
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త కళను సంతరించుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త బ్యాగేజీ రూల్స్ ( New Baggage Rules) వచ్చాయి.దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రయాణికులు తమతో తెచ్చుకునే వస్తువుల విలువ పరిమితిని భారీగా పెంచారు.
విదేశాల నుంచి వచ్చే ఇండియన్స్ ఇప్పటివరకు రూ. 50 వేల వరకు వస్తువులను డ్యూటీ ఫ్రీగా అంటే పన్ను లేకుండా తెచ్చుకునేవారు. కానీ ఈరోజు నుంచి ఆ లిమిట్‌ని ఏకంగా రూ. 75 వేలకు పెంచారు. అంటే సుమారు 50 శాతం అదనపు వెసులుబాటు లభించింది.
విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు , తరచుగా విదేశీ పర్యటనలు చేసేవారికి నిజంగా ఇది ఒక పండుగ లాంటి వార్తే. ఉదాహరణకు, మీరు విదేశాల నుంచి ఒక ఖరీదైన ల్యాప్‌టాప్ లేదా ఐఫోన్ తెచ్చుకోవాలనుకుంటే, ఇప్పటివరకూ ఉన్న రూల్ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది.
కానీ కొత్త బ్యాగేజీ రూల్స్ ( ( New Baggage Rules) ) ప్రకారం ఇప్పుడు రూ. 75 వేల లోపు ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ చానల్ ద్వారానే ఇంటికి వెళ్లిపోవచ్చు. అలాగే విదేశీ పర్యాటకుల పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచారు. బంగారం విషయంలో కూడా మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల వరకు వెసులుబాటు కల్పించడం విశేషం. అయితే మద్యం , సిగరెట్ల పరిమితిలో మాత్రం ఎటువంటి మార్పులు లేవు.
డొమెస్టిక్ ఫ్లైట్స్ – క్యాబిన్ బ్యాగేజీలో జాగ్రత్తలు..ఇంటర్నేషనల్ రూల్స్ మారినా, దేశీయ విమాన ప్రయాణాల్లో (Domestic Flights) మాత్రం పాత నిబంధనలే కొనసాగుతున్నాయి. చాలా ఎయిర్‌లైన్స్ ఇప్పటికీ కూడా 7 కేజీల క్యాబిన్ బ్యాగేజీని మాత్రమే అనుమతిస్తున్నాయి.
ఎయిర్ ఇండియాలో మాత్రం 25 కేజీల వరకు చెక్-ఇన్ బ్యాగేజీకి అనుమతి ఉంది. ఒకవేళ మీరు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలనుకుంటే, విమానాశ్రయంలో కౌంటర్ దగ్గర చెల్లించే కంటే 24 గంటల ముందే ఆన్‌లైన్‌లో ప్రీ-బుక్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కేజీకి 200 నుంచి 300 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.
అయితే మీరు ప్రయాణించేటప్పుడు బ్యాగేజీ చార్జీల భారం తగ్గించుకోవాలంటే.. కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వండి అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇండిగో వంటి సంస్థల్లో ‘6E ప్రైమ్’ లాంటి ప్యాకేజీలు తీసుకుంటే 10 కేజీల ఎక్స్‌ట్రా లగేజీ ఫ్రీగా లభిస్తుంది.
అలాగే ఎయిర్ ఇండియా ‘ఫ్లయింగ్ రిటర్న్స్’ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఎక్స్‌ట్రాగా 15 కేజీల వరకు వెసులుబాటు ఉంటుంది. ఇంటి దగ్గరే బ్యాగేజీ వెయిట్ చెక్ చేసుకోవడానికి ఒక చిన్న హ్యాండీ స్కేల్ కొనుక్కుంటే.. ఎయిర్‌పోర్ట్‌లో పడే టెన్షన్ తప్పుతుంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేటప్పుడు అందరి లగేజీని కలిపి (Family Pooling) మేనేజ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా చార్జీలు పడకుండా చేసుకోవచ్చు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విదేశాలకు వెళ్లే వారు కొత్త రూల్స్ గురించి అవగాహన పెంచుకుని ప్రయాణించడం మంచిది. 75 వేల లోపు షాపింగ్ చేసేవారికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతుంది.
ప్యాకింగ్ చేసేటప్పుడే విలువైన వస్తువుల బిల్లులను సిద్ధంగా ఉంచుకుంటే వల్ల కస్టమ్స్ అధికారుల దగ్గర సమయం ఆదా అవుతుంది. ప్రయాణం హ్యాపీగా సాగాలంటే.. రూల్స్ తెలుసుకుని, స్మార్ట్ గా ప్లాన్ చేసుకోండి
Dark Sky Tourism:నక్షత్రాల లోకంలోకి ఒక అద్భుత ప్రయాణం..ఛలో డార్క్ స్కై టూరిజం
