Train our brain: ప్రశాంతంగా జీవించడం కోసం మెదడుకు ఇలా శిక్షణ ఇద్దామా? ప్రతీ క్షణాన్ని ఆస్వాదిద్దామా?

Train our brain: మైండ్‌ఫుల్‌నెస్ అంటే కేవలం కూర్చుని కళ్లు మూసుకోవడం కాదు, అది నిర్ణయాత్మక పరిశీలన (Non-judgmental Observation) యొక్క ఒక కళ.

Train our brain

ప్రస్తుతం మానసిక ఒత్తిడి (Stress) ,ఆందోళన (Anxiety) అనేది అందరిలో ఒక సాధారణ సమస్యగా మారింది. , గతంలో జరిగిన వాటి గురించి పశ్చాత్తాపపడటం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ద్వారా మనం తరచుగా వర్తమానాన్ని (Present Moment) కోల్పోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా, దాదాపు 2,500 సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మంలో (Buddhism) ఉద్భవించిన ఒక అద్భుతమైన భావనే ‘మైండ్‌ఫుల్‌నెస్’ (Mindfulness) . అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మెడిటేషన్‌గా (Meditation Practice) ప్రాచుర్యం పొందింది. మైండ్‌ఫుల్‌నెస్(Train our brain) అంటే కేవలం కూర్చుని కళ్లు మూసుకోవడం కాదు, అది నిర్ణయాత్మక పరిశీలన (Non-judgmental Observation) యొక్క ఒక కళ.

మైండ్‌ఫుల్‌నెస్(Train our brain) అనేది మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి, మన లోపలి ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అనుభూతుల గురించి పూర్తి అవగాహనతో (Awareness) ఉండటాన్ని సూచిస్తుంది. ఇది మనకు కష్టంగా అనిపించే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిపై స్పందించకుండా, వాటిని కేవలం పరిశీలించడం నేర్పుతుంది. ఇది బౌద్ధుల విపస్సన ధ్యాన పద్ధతికి దగ్గరగా ఉంటుంది.

Train our brain

దీని ముఖ్య ఉద్దేశం మన అంతర్గత మరియు బాహ్య ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించడం. ఆధునిక సైకాలజీ (Psychology) కూడా దీనిని ఒక ప్రభావవంతమైన ఒత్తిడి నివారణ మార్గంగా గుర్తించింది. మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత కాగ్నిటివ్ థెరపీ (MBCT) మరియు ఒత్తిడి తగ్గింపు కార్యక్రమాలు (MBSR) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో , కార్పొరేట్ కార్యాలయాల్లో ఉపయోగించబడుతున్నాయి.

ఈ అభ్యాసం ద్వారా వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు, దీనివల్ల నిరాశ, ఆందోళనతో పాటు దీర్ఘకాలిక నొప్పి (Chronic Pain) వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందగలుగుతారు.

మైండ్‌ఫుల్‌నెస్‌ను రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేదా భోజనం చేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. ఉదాహరణకు, భోజనం చేసేటప్పుడు, ఆ ఆహారం యొక్క వాసన, రుచి , దానిని నమలడం ద్వారా కలిగే అనుభూతిపై పూర్తిగా దృష్టి పెట్టడం ద్వారా మనం మైండ్‌ఫుల్‌నెస్‌ను సాధించొచ్చు.

Train our brain

ఇది మన మెదడును (Brain) ప్రస్తుతం చేస్తున్న పనిపై కేంద్రీకరించడానికి శిక్షణ ఇస్తుంది, దీని ద్వారా మనసు పాత లేదా భవిష్యత్తు విషయాల వైపు పరుగెత్తకుండా నిరోధిస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్ అనేది మన జీవితంలో అశాంతిని (Restlessness) తగ్గించి, నిశ్చలమైన సంతృప్తిని (Calm Contentment) పెంచుతుంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు.. వేగంగా మారుతున్న ప్రపంచంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఒక ప్రాథమిక సాధనం. ఈ పద్ధతి ద్వారా, మన ప్రతి కదలికలో, ప్రతి శ్వాసలో, మనం నివసించే ఈ క్షణంలోనే పూర్తి జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version