Mask:సందర్భాన్ని బట్టి ముసుగు.. నిజమైన మనిషి మాయం అయిపోతున్నాడా?

Mask: ఇంట్లో వాళ్లతో ఉండే ముఖం వేరు, ఆఫీసులో బాస్ ముందు ఒకటి కొలీగ్స్ ముందు ప్రదర్శించే ముఖం వేరు , సాయంత్రం స్నేహితులతో కూర్చున్నప్పుడు కనిపించే ముఖం వేరు.

Mask

ప్రతిరోజూ అద్దం ముందు నిలబడినప్పుడు కనిపించే ముఖం అందరిదీ ఒకటే కావొచ్చు. కానీ, ఆ అద్దం దాటి బయట అడుగు పెట్టిన క్షణం నుంచి మనం ఎన్ని రకాల ముఖాలను మారుస్తామో మనకే తెలియదు.

ఉదయం నిద్రలేవగానే ఇంట్లో వాళ్లతో ఉండే ముఖం వేరు, ఆఫీసులో బాస్ ముందు ఒకటి కొలీగ్స్ ముందు ప్రదర్శించే ముఖం వేరు , సాయంత్రం స్నేహితులతో కూర్చున్నప్పుడు కనిపించే ముఖం వేరు.

ఇలా సందర్భాన్ని బట్టి మనమంతా వేసుకునే ఈ ముసుగు(Mask )లను సైకాలజీలో పర్సోనా అని పిలుస్తారు. అసలు మనం ఈ ముసుగులు ఎందుకు వేసుకుంటాం? మన అసలు రూపం ఎక్కడ దాగి ఉందనే ప్రశ్నల చుట్టూ పర్సోనా ఉంటుంది.
ప్రతీ మనిషి ఒక సామాజిక జీవి. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు పొందాలని, అందరితో కలిసిపోవాలని ఆశపడటం సహజం. దీనిలో భాగంగానే మనం ఎదుటివారికి నచ్చేలాగా ఎక్కువ శాతం మనల్ని మనం మలుచుకుంటాం.

Mask

ఆఫీసులో సీరియస్‌గా లేకపోతే విలువ ఉండదని ఒక ముసుగు(Mask), బంధువుల ముందు చాలా సంప్రదాయంగా ఉండాలని మరో మంచితనం ముసుగు వేసుకుంటాం. ఇవన్నీ ఒక రకంగా మనల్ని మనం రక్షించుకోవడానికి వేసుకునే మాస్కులు వంటివి. కానీ, ఈ ముసుగుల వల్ల వచ్చే అసలు చిక్కేమిటంటే, అలా ఇతరుల కోసం నటిస్తూ పోతే ఒకానొక దశలో మన అసలు వ్యక్తిత్వం ఏంటో మనమే మర్చిపోయే ప్రమాదముంది.

చాలామంది వ్యక్తులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురిలోకి వచ్చినప్పుడు మరోలా మారిపోతుంటారు. దీనిని సోషల్ క్యామిలియన్ అంటారు. అంటే ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మనిషి తన ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తాడు.

ఇది కొన్నిసార్లు అవసరమే కావొచ్చు, కానీ ఎక్కువయితే మాత్రం అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. చివరకు మనం ధరించే ముసుగు(Mask)కు, మన లోపల ఉండే అసలు మనిషికి మధ్య దూరం పెరుగుతూ ఉంటే మనలో తెలియని అసంతృప్తి మొదలవుతుంది. మనకు నచ్చని పనిని.. నచ్చినట్లు నటిస్తూ చేయడం వల్ల మెదడులో తీవ్రమైన ఘర్షణ మొదలవుతుంది.

దీనికోసం చిన్న ఉదాహరణ తీసుకుంటే.. సోషల్ మీడియాలో మనం పెట్టే ఫోటోలన్నీ కూడా ఒక రకమైన ముసుగులే. లోపల ఎంత బాధ ఉన్నా, ఫోటోలో మాత్రం నవ్వుతూనే కనిపిస్తాం. ఎందుకంటే సొసైటీ సంతోషంగా ఉన్న వాళ్లనే ఇష్టపడుతుంది.

ఇలా ప్రపంచానికి మన లోపలి చీకటిని చూపించకుండా ముసుగు వేసుకుని బతకడం వల్ల మనం ఎమోషనల్‌గా ఒంటరి వాళ్లమయిపోతాం. నిజమైన సంతోషం ఏంటంటే మన ముసుగులను తీసి పక్కన పెట్టినప్పుడు కూడా మనల్ని ప్రేమించే వ్యక్తులు మన పక్కన ఉండటమే.

Mask

మనల్ని మనం తెలుసుకోవడం అంటే, ఈ ముసుగుల వెనుక ఉన్న అసలు మనిషిని వెతకడమే. మనం ఎవరి కోసం మనల్ని మనం మార్చుకుంటున్నాం..అసలు  అది మనకు ఆనందాన్ని ఇస్తుందా లేక బరువుగా అనిపిస్తుందా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ముసుగులు వేయడం తప్పు కాదు, కానీ ఆ ముసుగే మన ముఖంగా మారిపోకూడదు. మనలోని బలహీనతలను, భయాలను అంగీకరించినప్పుడే మనం నిజమైన మనుషులమవుతాం. అప్పుడే ఈ ఆర్టిఫిషియల్ ముసుగుల అవసరం లేకుండానే  ప్రశాంతంగా బతకగలుగుతాం.

Tilak Varma : వార్మప్ లో తిలక్ వర్మ అదుర్స్..యూఎస్ఏపై భారత్ ఏ విక్టరీ

Exit mobile version