WPL
మహిళల ప్రీమియర్ లీగ్(WPL) (డబ్ల్యూపీఎల్) చివరి దశకు చేరింది. రెండు జట్లు ఇంటిదారి పడితే, మరో మూడు జట్లు ముందంజ వేశాయి. టైటిల్ వేటలో దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన జట్లపై ఆధిపత్యం కనబరిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే మరో రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. దీనిలో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ ఆడనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది.
లీగ్ స్టేజ్ ను 5 విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంతో ముగిస్తే.. ఢిల్లీ 4 గెలుపు, మూడు ఓటములతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే లీగ్ స్టేజ్ లో ఇరు జట్లు రెండుసార్లు తలపడితే గుజరాత్ జెయింట్స్ దే పైచేయిగా నిలిచింది. తొలిసారి 4 పరుగులతోనూ తర్వాత 3 రన్స్ తోనూ ఢిల్లీపై గుజరాత్ గెలిచింది.ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. తమ తమ చివరి మ్యాచ్ లలో ఢిల్లీ , యూపీ వారియర్స్ ను చిత్తు చేస్తే… గుజరాత్ , ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL) లో గుజరాత్ జెయింట్స్ నిలకడగా రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన తర్వాత హ్యాట్రిక్ ఓటములతో వెనుకబడింది. కానీ కీలక సమయంలో పుంజుకుని మళ్లీ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆష్లే గార్డనర్ సారథ్యంలోని గుజరాత్ కు బెత్ మూనీ, సోఫీ డివైన్ తో పాటు అనుష్క శర్మ, రేణుకా ఠాగూర్ కీలకం కానున్నారు.
ఆష్లే గార్డనర్, అనుష్క శర్మ ఫామ్ లో ఉండడం అడ్వాంంటేజ్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టోర్నీలో అద్భుతంగా పుంజుకుంది. తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న జెమీమా రోడ్రిగ్స్ ఆరంభంలో కాస్త ఒత్డిడికి గురైనట్టు కనిపించింది. లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ ఇప్పటి వరకూ పెద్దగా ఆడింది లేదు. దీంతో ఎలిమినేటర్ లో ఆమె నుంచి టీమ్ మేనేజ్ మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అలాగే ఢిల్లీ జట్టు లారా వోల్వార్ట్ , మరిజెన్నా కాప్ , లిజెల్లీ లీ, శ్రీచరణి , మిన్నూ మణి, చినెల్లీ, స్నేహరాణపై అంచనాలున్నాయి.
T20 World Cup : మన షెడ్యూల్ మనదే..పాక్ ఆడకున్నా కొలంబోకు భారత్
