Mind:మీ మనసును మీరే అదుపులోకి తెచ్చుకోండి.. ఇలా!

Mind: మానసిక స్థితి నుంచి బయటపడటానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించే అద్భుతమైన పద్ధతే 'థాట్ స్టాపింగ్' లేదా 'రెడ్ కార్డ్' టెక్నిక్ .

Mind

మనిషి శరీరం ప్రస్తుత కాలంలో ఉన్నా, మనసు మాత్రం చాలా సార్లు గతంలోనే బందీ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా చేదు జ్ఞాపకాలు, అవమానాలు లేదా విఫలమైన సంబంధాలు చాలామందిని పదే పదే వేధిస్తుంటాయి. దీనినే సైకాలజీలో ‘రూమినేషన్’ (Rumination) అంటారు.

అంటే ఒకే చెడు ఆలోచనను పదే పదే నెమరువేసుకోవడం, బాధపడటం చేస్తుంటారు. దీనివల్ల తెలీయకుండానే వాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి మానసిక స్థితి నుంచి బయటపడటానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించే అద్భుతమైన పద్ధతే ‘థాట్ స్టాపింగ్’ లేదా ‘రెడ్ కార్డ్’ టెక్నిక్ .

ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందంటే.. మనిషి మెదడుకు ( Mind ) ఒక అలవాటు ఉంటుంది, మనిషి దేనినైతే మర్చిపోవాలని అనుకుంటాడో, దానినే అది ఎక్కువగా గుర్తు చేస్తుంది. అందుకే ఆ బాధను, ఆలోచనను మర్చిపోవాలని ప్రయత్నించడం కంటే, ఆ ఆలోచన వచ్చే ‘దారిని’ మళ్లించడం ముఖ్యం.

Mind

ఎప్పుడైనా మీకు బాధాకరమైన పాత జ్ఞాపకం మొదలవుతుందని అనిపించినప్పుడు, వెంటనే మనసులో గట్టిగా ఆగు(stop) అని ఒక ఆర్డర్ వేయాలి. కళ్ల ముందు ఒక పెద్ద ఎరుపు రంగు ‘స్టాప్’ బోర్డు ఉన్నట్లు ఊహించుకోవాలి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీ తప్పు చేసిన ప్లేయర్‌కు రెడ్ కార్డ్ ఇచ్చి గ్రౌండ్ బయటకు పంపినట్లు, ఆ ఆలోచనను మనసులో నుంచి బయటకు పంపేయాలి.

దాని తర్వాత వెంటనే మెదడుకు ఒక చిన్న టాస్క్ ఇవ్వాలి. ఉదాహరణకు 100 నుంచి 7 వరకు వెనక్కి లెక్కపెట్టడం (100, 93, 86…) లేదా మీ చుట్టూ ఉన్న ఐదు వస్తువుల పేర్లను గట్టిగా చెప్పడం వంటివి చేయాలి. దీనివల్ల మీ మెదడు ( Mind) లాజికల్ థింకింగ్ లోకి మారిపోతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఎమోషనల్ జ్ఞాపకం అక్కడితో ఆగిపోతుంది.

దీనిని మనసు బాధపడిన ప్రతిసారీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల, కొన్ని రోజుల తర్వాత ఆ పాత జ్ఞాపకాలు వచ్చినప్పుడు మీ మెదడు ఆటోమేటిక్ గా వాటిని రిజెక్ట్ చేయడం నేర్చుకుంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇది ఒక పవర్‌ఫుల్ ఆయుధం వంటిది అంటారు నిపుణులు.

Aman Rao : కదంతొక్కిన కరీంనగర్ కుర్రాడు.. షమీ, ముకేశ్,ఆకాశ్ దీప్ లకు చుక్కలు

Exit mobile version