Biryani leaf Tea: సర్వరోగ నివారిణి ఈ టీ: రుచిలోనే కాదు..ఆరోగ్యంలోనూ సూపర్

Biryani leaf Tea:బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ ఇప్పుడు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.

Biryani leaf Tea

వెజ్ అయినా.. నాన్-వెజ్ అయినా.. బిర్యానీ ఆకు(bay leaf) వేస్తే ఆ రుచే వేరు. కానీ ఆకు కేవలం రుచి కోసమే అని అనుకుంటే పొరపాటే! నిపుణుల ప్రకారం, ఈ ఆకు కేవలం వంటకు రుచినివ్వడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ముఖ్యంగా, బిర్యానీ ఆకులతో తయారు చేసిన టీ ఇప్పుడు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. మరి ఈ అద్భుతమైన బిర్యానీ ఆకుల టీ ఎలా తయారు చేయాలో, దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం.

బిర్యానీ ఆకుల టీ (bay leaf tea) టీ తయారు చేయడం చాలా సులభం. దీనికోసం మీకు కావలసింది 2-3 కప్పుల నీరు మరియు 4-5 బిర్యానీ ఆకులు.

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు, తాజాగా ఉన్న బిర్యానీ ఆకులను చిన్న ముక్కలుగా చేసి అందులో వేయాలి. ఒకవేళ మీ దగ్గర ఎండిన ఆకులు ఉన్నా వాటిని కూడా ఉపయోగించవచ్చు.

Biryani leaf Tea

ఆకులను వేసిన తర్వాత మరో రెండు నిమిషాలు మరిగించి, స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే, రుచికరమైన, సువాసనతో కూడిన బిర్యానీ ఆకుల టీ (Biryani leaf Tea)సిద్ధమైనట్లే.

బిర్యానీ ఆకుల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే రుటిన్ మరియు కెఫిక్ ఆమ్లం వంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు.

బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, బెణుకులు వంటి వాటి వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం, బిర్యానీ ఆకుల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.

కిడ్నీ సమస్యలకు కూడా ఇది పరిష్కారం . బిర్యానీ ఆకుల టీ తీసుకోవడం వల్ల శరీరంలో యూరియా స్థాయిలు తగ్గుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నప్పుడు బిర్యానీ ఆకుల టీ (Biryani leaf Tea)చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్టీరియాను తొలగించి, శ్వాసను సులభతరం చేస్తుంది. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

బిర్యానీ ఆకులు(Biryani leaf) కేవలం వంటకు మాత్రమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.

 

Exit mobile version