Money
డబ్బు (Moneyఅనేది కేవలం వస్తువులను కొనే సాధనం మాత్రమే కాదు..అది మన మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్దం అంటారు సైకాలజిస్టులు. మనం డబ్బును ఎలా సంపాదిస్తున్నాం..ఎలా ఖర్చు చేస్తున్నామనే దాని వెనుక లోతైన మానసిక కారణాలు ఉంటాయి.
కొందరు వ్యక్తులు రూపాయి రూపాయి (Money)కూడబెట్టి దాచుకుంటారు దీనిని ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనస్తత్వం అంటారు. కానీ వీరు భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందుతుంటారు.
మరికొంతమంది తమ ఆదాయానికి మించి ఖర్చు చేస్తుంటారు. వీరు ఇతరుల ముందు గొప్పగా కనిపించాలని కానీ తక్షణ ఆనందం కోసం ఆరాటపడే మనస్తత్వం కలిగి ఉంటారు. దీనినే ‘ఇంప్రెషన్ మేనేజ్మెంట్’ అంటారు. అందుకే మీరు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని బట్టి మీరు ఎంతటి మానసిక ధైర్యం గలవారో చెప్పొచ్చు.
సైకాలజీ చెబతున్న దాని ప్రకారం, ఎవరైతే వస్తువుల కంటే అనుభవాల మీద (ట్రిప్స్, కొత్త విషయాలు నేర్చుకోవడం) ఖర్చు చేస్తారో, వారు జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటారట. ఎందుకంటే వస్తువులు ఇచ్చే ఆనందం కొద్ది రోజులే ఉంటుంది.. కానీ అనుభవాలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి.
డబ్బు పట్ల మనకున్న దృక్పథం మనం పెరిగిన వాతావరణం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూసిన వారు పెద్దయ్యాక విపరీతమైన పొదుపు ధోరణిని అలవర్చుకుంటారు.
అయితే జీవితాన్ని సంతోషంగా గడపడానికి డబ్బు అవసరమే కానీ డబ్బును ప్రేమించడం వేరు, డబ్బుకు బానిస అవ్వడం వేరు. మీ ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడే మీరు మానసికంగా స్వతంత్రులు అవుతారు. డబ్బు గురించి సరిగ్గా అవగాహన పెంచుకోవడం వల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.
