Kitchen:వంటగదిలో ఈ వస్తువులు అస్సలు ఉండకూడదట..

Kitchen: వాస్తు ప్రకారం వంటగదిలో ఉండే సానుకూల శక్తి మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది.

Kitchen

ఇంట్లో వంటగది (Kitchen) అనేది కేవలం ఆహారం వండుకునే ఒక ప్రదేశం మాత్రమే కాదు. అది మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని నిర్ణయించే శక్తి కేంద్రం అని పెద్దలు చెబుతూ ఉంటారు. వాస్తు ప్రకారం వంటగదిలో ఉండే సానుకూల శక్తి మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

అంతేకాదు కొన్ని వస్తువులను వంటగదిలో ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు

ముందుగా, వంటగది(Kitchen)లో పగిలిన గాజు సామాన్లు లేదా విరిగిపోయిన ప్లాస్టిక్ డబ్బాలను అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయట. అలాగే కొంతమంది తీయడానికి వీలుగా ఉంటుందని వంటగదిలో మెడిసిన్ బాక్స్ (మందులు) ఉంచుతారు. కానీ ఇలా చేయడం చాలా పెద్ద వాస్తు దోషం.

 

Kitchen

వంటగదిలో మెడిసిన్స్ ఉంచడం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మందులను ఎప్పుడూ గదిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ భద్రపరచుకోవాలి.

వంటగది కింద కానీ పక్కన కానీ వాష్ రూమ్ (Bathroom) ఉండటం కూడా మంచిది కాదట. ఒకవేళ అలా ఉంటే మధ్యలో ఒక వాస్తు పిరమిడ్ అమర్చడం వల్ల దోషం తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే వంటగదిలో అద్దాలను ఉంచడం కూడా నిషిద్ధం, ఎందుకంటే స్టవ్ వెలుగు ఆ అద్దంలో ప్రతిబింబించడం వల్ల ఆ ఇంట్లో అశాంతి కలుగుతుందట.

అలాగే రాత్రి పడుకునే ముందు వంటగదిలోనే ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు.ఆ గిన్నెలను బయట టబ్‌లో పెట్టడమో లేదంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడమో చేయాలి.అలా చేస్తే అన్నపూర్ణ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ నియమాలు పాటిస్తే వంటగది ఆరోగ్యం, సంపదకు మూలమవుతుంది.

Greenland:గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ఇటాలియన్ ప్రధాని మెలోని స్ట్రాంగ్ కౌంటర్

 

Exit mobile version