Self-Confidence: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ సూత్రాలు పాటించండి!

Self-Confidence: ఇతరుల అభిప్రాయాలకు ఇచ్చే విలువ కంటే, మీకు మీరు ఇచ్చే గౌరవం అనేది ఎప్పుడూ ముఖ్యం.

Self-Confidence

మన జీవితంలో మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎదుటివారు ఏదైనా చిన్న మాట అన్నా, లేదా వారిని తక్కువ చేసి మాట్లాడినా చాలా ఎక్కువగా కృంగిపోతుంటారు. దీనికి కారణం వారిలో ఆత్మవిశ్వాసం(Self-Confidence) లోపించడమే.

సైకాలజీ ప్రకారం, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటమో, చూడటమో చేశారంటే అది వారి బలహీనతే తప్ప మీ తప్పు కాదన్న విషయాన్ని (Self-Confidence)గుర్తు పెట్టుకోవాలి. ఇతరుల అభిప్రాయాలకు ఇచ్చే విలువ కంటే, మీకు మీరు ఇచ్చే గౌరవం అనేది ఎప్పుడూ ముఖ్యం. దీని కోసం ప్రతిరోజూ ‘పాజిటివ్ సెల్ఫ్ టాక్’ అలవాటు చేసుకోవాలి. అంటే మీలోని ప్లస్ పాయింట్ల గురించే మీరు ఎక్కువగా ఆలోచించాలి. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగడమే మానసిక పరిపక్వత.

Self-Confidence

ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడం, ఇతరుల విజయాలతో మిమ్మల్ని పోల్చుకోవడం, మానేసి, నిన్నటి కంటే ఈరోజు మీరెంత మెరుగ్గా ఉన్నారో చూసుకోండి. ఒకప్పుడు మీరెలా ఉండేవారో లేదో గతంలో మీరు సాధించిన లేదా అంతా మెచ్చుకున్న సందర్భాలను పదే పదే గుర్తు చేసుకోవాలి. మీకు మీరే ఒక రోల్ మోడల్ అనుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి.

ముందుగా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. విమర్శలను ఒక మెట్టులా భావించి వాటిని ఓవర్ కమ్ చేస్తూ(Self-Confidence) ఎదగాలి తప్ప, వాటిని తలచుకుని బాధపడకూడదు. రోజూ ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీ లక్ష్యాల పట్ల మీకు క్లారిటీ ఉన్నప్పుడు ప్రపంచం ఏమనుకుంటున్నా మీకు అనవసరమే అవుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మనసును అదుపులో ఉంచుకోవడం అంటే మన జీవితాన్ని కూడా అదుపులో ఉంచుకోవడమే అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version