Medicines
ఈ కాలంలో చిన్న అనారోగ్యం వస్తే చాలు.. వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెత్తడం, టాబ్లెట్లు మింగడం అలవాటుగా మారింది. కానీ, మన పూర్వీకులు అనుసరించిన జీవనశైలిలోనే అసలైన మందులు ఉన్నాయని మీకు తెలుసా? ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఈ ‘లైఫ్ స్టైల్ మెడిసిన్’ అద్భుత ఫలితాలను ఇస్తుందని అంగీకరిస్తోంది.
నిద్ర..త్వరగా పడుకుని, సూర్యోదయానికి ముందే లేవడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.నిద్ర అన్ని రోగాలకు మెయిన్ మెడిసిన్(Medicines).
సూర్యరశ్మి.. ఉదయం ఎండలో నిలబడటం వల్ల లభించే విటమిన్-డి ఎముకలకే కాదు, రోగనిరోధక శక్తికి కూడా ఒక టాబ్లెట్.
మట్టి పాత్రలు.. మట్టి కుండలోని రోజూ నీరు తాగడం వల్ల శరీరంలోని ఆమ్ల గుణాలు (Acidity) తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
నమిలి తినడం.. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల లాలాజలంతో కలిసి జీర్ణప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు పెద్ద మందు.
నడక & యోగా.. ఉదయం, సాయంత్రం నడక గుండె ఆరోగ్యానికి మందు అయితే, యోగా , ప్రాణాయామం ఊపిరితిత్తులకు, మెదడుకు శక్తినిచ్చే మందులు.
వజ్రాసనం.. తిన్న తర్వాత పది నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణకోశ వ్యాధులకు రామబాణం.
నవ్వు..ముఖ్యంగా నవ్వు నాలుగు విధాలా చేటు అన్న ఒకప్పటి మాట పోయి నవ్వు డెబ్బై రోగాలకు మందు(Medicines) అన్న రోజులు వచ్చేసాయి. నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి.
మౌనం & సంతృప్తి.. అనవసర చర్చలు, వాగ్వాదాల కంటే మౌనం పాటించడం అనే మందు, ఉన్నదానితో సంతృప్తి చెందడం వల్ల రక్తపోటు (BP) ఒత్తిడి నియంత్రణలో ఉంచే ప్రీ మందులే.
కుటుంబం..అందరితో కలిసి భోజనం చేయడం, మంచి స్నేహితులతో సమయం గడపడం ఒంటరితనాన్ని పోగొట్టి మానసిక బలాన్ని ఇస్తుంది.
నిస్వార్థ సేవ.. ఎదుటివారికి నిస్వార్ధంగా సాయం చేయడం వల్ల కలిగే ఆనందం వల్ల.. మెదడులోని రివార్డ్ సెంటర్లను ఉత్తేజితం అవుతాయి.అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ మందులన్నిటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..ప్రిస్క్రిప్షన్ అసలే అవసరం లేదు, అసలు ఖర్చే ఉండదు. అంతెందుకు ప్రకృతితో కలిసి జీవించడమే అసలైన వైద్యం అని తెలుసుకోవాలి. అందుకే మీరు కూడా ఈ ‘మందులను’ ప్రతిరోజూ మర్చిపోకుండా వాడుతూ ఆరోగ్యంగా ఉండండి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.
Under 19 World Cup : శతక్కొట్టిన ఆరోన్ జార్జ్..అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
