Children: పిల్లలకు మనమే ఇలా అలవాటు చేయాలి..

Children: కొంతమంది పిల్లలు ఏది పెట్టినా తినకుండా మారాం చేయడంతో ఆందోళన చెందుతుంటారు. ఇలా కాకుండా, పిల్లలకు అన్ని రకాల ఆహార పదార్థాలను అలవాటు చేయడానికి న్యూట్రిషనిస్టులు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు.

Children

కొంతమంది పిల్లలు(Children) కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. దీని వల్ల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఏది పెట్టినా తినకుండా మారాం చేయడంతో ఆందోళన చెందుతుంటారు. ఇలా కాకుండా, పిల్లలకు అన్ని రకాల ఆహార పదార్థాలను అలవాటు చేయడానికి న్యూట్రిషనిస్టులు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు.

పిల్లలకు ఆహారం అలవాటు చేసే పద్ధతులు..

పెద్దలే ఆదర్శం.. తిండి విషయంలో పిల్లలకు చెప్పే ముందు, ఇంట్లో పెద్దలే ముందుగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టంగా తినే అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు తినే విధానాన్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు.

సీజనల్ అలవాట్లు.. ఆయా సీజన్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లను చిన్నప్పటి నుంచే వారికి తినిపించడం అలవాటు చేయాలి. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆకర్షణీయమైన వంటకాలు.. పిల్లలను రంగు, రుచి, వాసన త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి ఆహార పదార్థాలను ఆకట్టుకునేలా, రుచిగా వండాలి. సాదాసీదాగా కాకుండా, కొంచెం సృజనాత్మకంగా అందిస్తే వారు ఇష్టంగా తింటారు.

కొత్త రూపంలో అందించడం.. ఒకవేళ పిల్లలు పండ్లు, కూరగాయలు లేదా ఆకుకూరలను నేరుగా తినడానికి ఇష్టపడకపోయినా, వాటిని ఏదో ఒక రూపంలో కొత్త వంటకాలుగా చేసి అందించాలి (ఉదాహరణకు, ప్యూరీస్, స్మూతీస్, వెజిటబుల్ కట్లెట్స్).

Children

బెల్లం వైపు మొగ్గు.. చిన్నప్పుడే పిల్లలకు కారం, పులుపు, చేదు ఎక్కువగా ఉండే పదార్థాలను పెడితే వారు తినడానికి ఇష్టం చూపరు. అందుకే, అలాంటి పిల్లలకు సాధారణ చక్కెర వాడకుండా, బెల్లంతో చేసిన వంటకాలను ముందుగా రుచి చూపించడం మంచిది.

లాభాలు చెప్పడం.. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, మాంసం వంటివి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పిల్లలకు తరచుగా చెబుతూ ఉండాలి. ఇది వారికి ఆ పదార్థాల పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తుంది.

కలిసి భోజనం.. వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరించి తినడానికి ఇష్టపడతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version