Lies:మీకు తెలుసా? అబద్ధం చెప్పినపుడు ఆ మనిషి బాడీ దానిని యాక్సెప్ట్ చేయదట..

Lies: నిజం మాట్లాడటం కంటే అబద్ధం చెప్పడం అనేది మెదడుకు ఎక్కువ శ్రమతో కూడిన పని అని న్యూరోసైన్స్,సైకాలజీ వివరించాయి.

Lies

మానవ సంబంధాలలో అబద్ధం(Lies) అనేది ఒక సాధారణ విషయం. అయితే, మనిషి అబద్ధం చెప్పేటప్పుడు మెదడులో , శరీరంలో ఏమి జరుగుతుందనే దానిపై న్యూరోసైన్స్ , సైకాలజీ శాస్త్రాలు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. నిజం మాట్లాడటం కంటే అబద్ధం చెప్పడం అనేది మెదడుకు ఎక్కువ శ్రమతో కూడిన పని అని వివరించాయి.

అవును అబద్ధం(Lies) చెప్పడానికి మెదడు చాలా శ్రమ పడుతుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి మనకు సహజంగా వచ్చే ఆలోచనను వ్యక్తం చేస్తే సరిపోతుంది. కానీ అబద్ధం చెప్పడానికి మెదడులో నాలుగు క్లిష్టమైన దశలు దాటాలి:

నిజాన్ని దాయాలి (Truth Suppression).. ముందుగా అసలు నిజమేమిటో గుర్తుంచుకుని, దానిని బహిర్గతం కాకుండా ఆపాలి.

అబద్ధా(Liesన్ని సృష్టించాలి (Fabrication).. ఆ నిజానికి విరుద్ధంగా మరొక నమ్మదగిన కథను క్రియేట్ చేయాలి.

అంతేకాదు శరీర భాష, ముఖ కవళికలు, మాటల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలి.

ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్ క్రియాశీలత.. ఈ ప్రక్రియ అంతటికీ మెదడులోని ‘ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్’ అనే భాగం అత్యధిక శక్తిని ఉపయోగించి పనిచేస్తుంది. ఇది విమర్శనాత్మక ఆలోచన సంక్లిష్ట నిర్ణయాలకు కేంద్రం.

Lies

ఈ అధిక శ్రమ వల్ల, అబద్ధం చెప్పేటప్పుడు మెదడులో కార్యకలాపాలు పెరుగుతాయి.

మెదడులోని ఈ ఒత్తిడి కారణంగా, అబద్ధం చెప్పే వ్యక్తి శరీరంలో కొన్ని స్వయంచాలక (Automatic) మార్పులు జరుగుతాయి. వీటినే లై-డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్షలు కొలుస్తాయి.

భయం ,ఒత్తిడి కారణంగా గుండె వేగం (Heart Rate) పెరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో వేగం, లేదా అసాధారణ మార్పులు వస్తాయి. చర్మం యొక్క విద్యుత్ వాహకత (GSR) కనిపిస్తుంది. అంటే చర్మంలోని చెమట గ్రంథులు చురుకై, చర్మం యొక్క విద్యుత్ వాహకత మారుతుంది.

తరచుగా అబద్ధాలు చెప్పేవారిలో, ఆ చర్య పట్ల భావోద్వేగ ప్రతిస్పందన కాలక్రమేణా తగ్గిపోతుంది. దీనిని శాస్త్రవేత్తలు ‘డెసెప్షన్ డెసెన్సిటైజేషన్’ అంటారు. అంటే, తరచుగా అబద్ధం చెప్పడం వల్ల మెదడు ఆ చర్యను ఈజీగా ఆమోదించడం నేర్చుకుంటుంది.

అబద్ధం అనేది కేవలం నైతిక అంశమే కాదు, అది మెదడు యొక్క అత్యంత సంక్లిష్టమైన చర్య. అబద్ధం చెప్పడం ద్వారా నిజానికి, మనం మన సొంత శరీరానికే అదనపు ఒత్తిడిని , శ్రమను కలిగిస్తున్నామని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Sleeping with the light:లైట్ ఆన్ చేసి పడుకుంటున్నారా? జాగ్రత్త ..హార్ట్ అటాక్ ముప్పు పొంచి ఉందట

Exit mobile version