Old fort: 800 ఏళ్ల కోట.. అధునాతన ఇంజినీరింగ్‌కు ఉదాహరణ

Old fort: కుచ్‌మాన్ కోట కేవలం ఒక చారిత్రక కట్టడం కాదు, ఇది అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి, సాహసానికి ప్రతీక.

Old fort

సాహస ప్రియులకు, ట్రెక్కర్లకు, చరిత్ర ప్రేమికులకు రాజస్థాన్‌లోని నాగ్పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌మాన్ కోట ఒక అద్భుతమైన గమ్యస్థానం. 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కోట(Old fort)ను చేరుకోవడానికి మీరు ఒక రివర్స్ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మామూలు ప్రయాణం కాదు, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.

అబ్బురపరిచే కోట నిర్మాణ శైలి..దాదాపు 800 సంవత్సరాల క్రితం జలజలీమ్ సింగ్ అనే రాజు ఈ కోటను నిర్మించారు. కానీ, ఈ కోట (Old fort)నిర్మాణ శైలి ఇప్పుడు కూడా ఇంజినీర్లను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా, నీటిని నిల్వ చేయడానికి వారు ఉపయోగించిన అధునాతన టెక్నాలజీ అబ్బురపరుస్తుంది.

కోట పై భాగంలో 17 భారీ ట్యాంకులను నిర్మించి, ఒకదానితో ఒకటి అనుసంధానించారు. అప్పట్లో పైపులు లేనప్పటికీ, వర్షపు నీరు ఒక ట్యాంకు నుంచి మరో ట్యాంకుకు చేరే విధంగా ఒక అధునాతన డిష్‌ అండ్ డ్రైనేజ్ సిస్టమ్‌ను రూపొందించారు.

Old fort

రివర్స్ డ్రైవింగ్‌తోనే ప్రయాణం..ఈ కోట 800 మీటర్ల ఎత్తులో కొండ అంచున ఉంది. కోటలోకి వెళ్ళే మార్గం చాలా ఏటవాలుగా, ఇరుకుగా, ప్రమాదకరంగా ఉంటుంది. వాహనాలు ఆ మార్గంలో ముందుకు వెళ్లలేవు. అందుకే ఈ కోటను చేరాలంటే రివర్స్ డ్రైవింగ్ చేయాల్సిందే.

ఈ సాహసయాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అక్కడి పర్యాటక శాఖ నియమించిన ఈ డ్రైవర్లు పర్యాటకులకు ప్రతి క్షణం తోడుగా ఉండి, ఈ సాహస ప్రయాణాన్ని సురక్షితంగా మలుస్తారు. ప్రతి మలుపులోనూ నైపుణ్యం అవసరం. అక్కడికి చేరుకునేందుకు చేసే ఈ ప్రయాణం పర్యాటకులకు ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది.

కుచ్‌మాన్ కోట (Old fort)కేవలం ఒక చారిత్రక కట్టడం కాదు, ఇది అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి, సాహసానికి ప్రతీక. అందుకే ప్రతి సంవత్సరం వేలమంది దేశ, విదేశీ పర్యాటకులు ఈ అద్భుత ప్రయాణం కోసం ఇక్కడికి వస్తుంటారు

Azharuddin: అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి..మరి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు?

Exit mobile version