Azharuddin: అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి..మరి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు?
Azharuddin: బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని ఉప ఎన్నికలో నిలబెట్టాలని కాంగ్రెస్ భావించింది. అదే సమయంలో, మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది.

Azharuddin
ఒక్క నిర్ణయం.. తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్(Azharuddin)కు అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ట్విస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు తెర లేచింది. మరి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఈ ఒక్క నిర్ణయం ఉప ఎన్నిక సమీకరణాలను ఎలా మార్చబోతోందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఏకంగా ఎమ్మెల్సీ పదవి దక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.గతంలో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మీర్ అమీర్ అలీ ఖాన్ పేరు ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పేరును తొలగించి, ఆ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తెలంగాణ కేబినెట్ ప్రొఫెసర్ కోదండరాం , మహ్మద్ అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ ఆమోదం తెలిపింది. ఈ అనూహ్య నిర్ణయంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ రేసు నుంచి అజారుద్దీన్ తప్పుకున్నారు.
Gold : మరోసారి పెరిగిన పుత్తడి ధర.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
అయితే అజారుద్దీన్(Azharuddin)కు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉండటం వల్ల, మజ్లిస్ పార్టీ మద్దతు కూడా ముఖ్యమవుతుంది. ఈ సమయంలోనే నవీన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు.

కాంగ్రెస్ నిర్ణయం వెనుక గట్టి నిర్ణయమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ, బీసీ (వెనుకబడిన తరగతులు) ఓటర్లు కీలకం . బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని ఉప ఎన్నికలో నిలబెట్టాలని కాంగ్రెస్ భావించింది. అదే సమయంలో, మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. దీనివల్ల రెండు వర్గాలను సంతృప్తిపరచవచ్చని పార్టీ వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు.
మీర్ అమీర్ అలీ ఖాన్ బదులుగా అజారుద్దీన్‌ను ఎంచుకోవడం వెనుక పార్టీ లోపల, బయట ఉన్న ఒత్తిళ్లు కారణం అని తెలుస్తోంది. మైనారిటీ నాయకుల మధ్య సమన్వయం కోసం, పార్టీలో అంతర్గత విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎమ్మెల్సీ పదవి అనేది అసెంబ్లీ ఎన్నికల కంటే స్థిరమైనది, సురక్షితమైనది. అజారుద్దీన్ వంటి ప్రముఖుడిని నేరుగా గెలుపు కష్టమైన ఎన్నికల బరిలోకి దింపకుండా, ఆయనకు శాశ్వత రాజకీయ వేదిక కల్పించడం ద్వారా పార్టీలో ఆయన పాత్రను బలపరచాలని చూశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిర్ణయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త బీసీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కలిగింది. ఇది నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో అజారుద్దీన్(Azharuddin) మరింత ముఖ్యమైన పాత్ర పోషించేందుకు మార్గం సుగమం చేసినట్లు అయిందని భావిస్తున్నారు. .
One Comment