Registered post : అతి త్వరలో చరిత్రలో కలిసిపోనున్న రిజిస్టర్డ్ పోస్ట్

Registered post : రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై ..స్పీడ్ పోస్ట్‌నే ఇక అంతా..

Registered post

ఇప్పటి వరకూ ఎవరైనా ఉత్తరం రిజిస్టర్ చేయిస్తే, అందులో విలువ, నమ్మకం, అధికారికత ఉండేదని భావించేవాళ్లు. అయితే ఇప్పటి నుంచీ ఆ శకం ముగిసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే… భారత తపాలా శాఖ ఒక పెద్ద పంథాను ముగించి, మరో కొత్త దిశలోకి అడుగులు వేస్తోంది.

బ్రిటిష్ కాలం నుంచే మన తపాలా వ్యవస్థలో ఒక బలమైన స్ధానాన్ని సంపాదించుకున్న ‘రిజిస్టర్డ్ పోస్ట్(registered post)విధానం ఇక చరిత్ర కాబోతోంది. ఈ విధానాన్ని పూర్తిగా స్పీడ్ పోస్టు(Speed Post)లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే…ప్రపంచం మారుతోంది. టెక్నాలజీ వేగం పెరుగుతోంది. మనం పేపర్‌లా నెమ్మదిగా ఉండలేం. వినియోగదారులు కోరేది వేగం, స్పష్టత, ట్రాకింగ్. ఈ అవసరాలన్నింటిని ఒకే సేవలో కలిపి అందించాలన్నదే ఈ మార్పు వెనక గల ప్రధాన ఆలోచన.

Registered post

ఇకపై రిజిస్టర్డ్ పోస్టు (Registered post) సేవ లేదు – స్పీడ్ పోస్టే కొత్త ప్రామాణిక సేవ. అంటే… ఎవరు అధికారిక పత్రాలు పంపినా, కోర్టు నోటీసులు పంపినా, లాజిస్టిక్ వర్క్ అయినా… అన్నింటికీ ఇక స్పీడ్ పోస్ట్ ద్వారా సేవలు లభిస్తాయి. తపాలా శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి.

*ఒకేసారి ట్రాకింగ్, డెలివరీ స్టేటస్ సులభతరం చేయడం
*రెండు వేర్వేరు సేవలను కలిపి, ఒకే గొడుగు కిందకు తేవడం
*వినియోగదారులకు క్లారిటీ, వేగవంతమైన సేవ, ఎక్కువ నమ్మకాన్ని అందించడం

ఈ మార్పును దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లకు చెందిన మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు ఇప్పటికే సమాచారం అందించారు. ఆదేశాల ప్రకారం అవసరమైన పనులు సాంకేతిక మార్పులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మార్పుతో రిజిస్టర్డ్ పోస్టు సేవ పూర్తిగా నిలిపివేయనుంది.

ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు… ఓ శకానికి వీడ్కోలు. ఒకప్పుడు పోస్టాఫీసులలో ఓ ‘రెడ్ టాగ్’తో బంధించి పంపే ఆ లేఖల వెనక ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు… టెక్నాలజీ ఆధారిత, ట్రాక్ చేయగలిగే, వేగంగా అందే స్పీడ్ పోస్ట్ ఒక కొత్త యుగానికి నాంది పలుకుతోంది.

ఈ మార్పుతో ప్రభుత్వ విభాగాలు, న్యాయ వ్యవస్థ, విద్యా సంస్థలు వంటి కీలక రంగాల్లో అధికంగా రిజిస్టర్డ్ పోస్టు (Registered post) ను వినియోగించే వారంతా ఇక స్పీడ్ పోస్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం తపాలా శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించనుంది.

Also Read: Waste Plastic: వేస్ట్ ప్లాస్టిక్‌ను కూడా అమ్ముకోవచ్చట..

 

Exit mobile version