Ban Polygamy: రెండో పెళ్లి చేసుకుంటే జైలుకే..  ఏ రాష్ట్రంలో బిల్లు పాసయిందో తెలుసా ?

Ban Polygamy: ఒకసారి పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి మళ్లీ వివాహం చేసుకుంటే ఏడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్షతో, ఇంకా భారీగా జరిమానా కూడా విధించేలా చట్టాన్ని రూపొందించాడు.

Ban Polygamy

బహుభార్యత్వ నిషేధం(Ban Polygamy)పై మనదేశంలో ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఏదో ఒక కారణంతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి,. కొన్ని సందర్భాల్లో మూడో పెళ్లి చేసుకుంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఇకపై ఇలాంటి వాటికి అస్సోం రాష్ట్రంలో చెక్ పడింది. చారిత్రాత్మక బహు భార్యత్వ నిషేధ బిల్లును అస్సోం అసెంబ్లీ ఆమోదించింది.

ఈ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే(Ban Polygamy) సదరు భర్త జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల జైలు శిక్ష పడేలా అస్సోం ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. గత కొంతకాలంగా హిమంతబిశ్వ శర్మ సర్కారు దీనిపై పూర్తిస్థాయిలో చర్చించి ఇప్పుడు అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టింది. బిల్లు వెంటనే పాసైంది కూడా.

బిల్లు (Ban Polygamy)నిబంధనల ప్రకారం.. బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచిపెట్టి మళ్లీ వివాహం చేసుకుంటే ఏడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్షతో, ఇంకా భారీగా జరిమానా కూడా విధించేలా చట్టాన్ని రూపొందించాడు. అయితే కొన్ని వర్గాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఏరియాలకు చెందిన వారికి ఈ చట్టం వర్తించదు.

Ban Polygamy

అసెంబ్లీలో బహుభార్యత్వ బిల్లు(Ban Polygamy) పాసైన సందర్భంగా అస్సోం సీఎం హిమంతు బిశ్వ శర్మ ఈ చట్టంపై వివరణ కూడా ఇచ్చారు. తాము తీసుకొచ్చిన ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ముఖ్యంగా ఇస్లాంకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇస్లాం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదన్న అస్సోం సీఎం ఈ బిల్లు ఆమోదం పొందితే.. నిజమైన ముస్లింగా ఉండటానికి అవకాశం లభిస్తుందన్నారు.

నిజమైన ముస్లింలు ఈ చట్టాన్ని స్వాగతిస్తారనీ, టర్కీ వంటి దేశాల్లో కూడా బహు భార్యత్వ నిషేధ బిల్లు ఉందని గుర్తు చేశారు. అస్సోం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన భార్య లేదా భర్త బతికి ఉండగా, విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకుంటే శిక్షార్హులవుతారు.

మొదటి భార్యతో విడాకుల ప్రక్రియ పూర్తవకుండా రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు. ఇదిలా ఉంటే ఈ బిల్లుపై విపక్షాలు ఇంకా స్పందించలేదు. మరోవైపు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తాను గెలిస్తే అస్సోంలో యూనిఫాం సివిల్ కోడ్ చేస్తానని హిమంతు బిశ్వశర్మ చెప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version