Honeymoon: భారతదేశపు బెస్ట్ హనీమూన్ లోకేషన్స్: తక్కువ బడ్జెట్‌లోనే !

Honeymoon:దట్టమైన పొగమంచు, తేయాకు తోటల మధ్య ఉండే చిన్న కుటీరాల్లో కూర్చొని ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం ఒక మధురానుభూతి.

Honeymoon

జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు, ఆ క్షణాలను అందమైన, ప్రైవేటు ప్రదేశాల్లో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటివారి కోసం మన దేశంలోనే ఎన్నో అద్భుతమైన హనీమూన్ (Honeymoon)స్పాట్లు ఉన్నాయి. ఆ మనోహరమైన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం.

తమిళనాడులోని ఊటీని ‘క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్’ అని పిలుస్తారు. నీలగిరి కొండల మధ్య ఉండే ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం. వేసవిలో కూడా చల్లగా ఉండే ఇక్కడ మే నెలలో పర్యటిస్తే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఊటీకి దగ్గర్లోనే ఉన్న కొడైకెనాల్‌ను ‘ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్’ అని అంటారు. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలో చల్లటి వాతావరణంలో సేదతీరడానికి, రొమాంటిక్‌గా గడపడానికి ఈ ప్రదేశాలు ఉత్తమం.

Honeymoon

దేవుని సొంత దేశం కేరళలోని మున్నార్.. పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఇక్కడ చల్లని గాలి, పచ్చని తేయాకు తోటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. దట్టమైన పొగమంచు, తేయాకు తోటల మధ్య ఉండే చిన్న కుటీరాల్లో కూర్చొని ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం ఒక మధురానుభూతి. ఇక్కడ సరస్సులు, హౌస్ బోట్లు, స్పా సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

బీచ్‌లు, పార్టీలు, కలర్ఫుల్ నైట్ లైఫ్ ని కోరుకునే వారికి గోవా ఉత్తమమైన ప్రదేశం. హనీమూన్ జ్ఞాపకాలను ఇక్కడ పదిలం చేసుకోవచ్చు. తీర ప్రాంతాలు, గేమింగ్, పబ్బులు, రెస్టారెంట్లు అనేకం ఉంటాయి. ఇక్కడ డిసెంబర్ నుంచి జూన్ వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వీకెండ్ పార్టీలతో గోవా వాతావరణం ఎప్పుడూ సందడిగా ఉంటుంది.

Honeymoon

భారతదేశపు స్విట్జర్లాండ్‌గా పిలవబడే కశ్మీర్ హనీమూన్‌(Honeymoon)కు బెస్ట్ ప్లేస్. ఇక్కడి అద్భుతమైన దృశ్యాలు, అందమైన లోయలు జీవితాంతం గుర్తు పెట్టుకునేంత జ్ఞాపకాలను అందిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, దాల్ సరస్సులో హౌస్ బోట్లలో గడపడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

అలాగే, సిక్కిం కూడా మంచు కొండలు, నీలి రంగు సరస్సులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ట్రెక్కింగ్‌కు ఇష్టపడే వారికి, ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే వారికి ఈ ప్రాంతం చాలా బాగుంటుంది.

Honeymoon

బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు దేశ పర్యాటకానికి తలమానికం. ఇక్కడి బీచ్‌లు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. స్వచ్ఛమైన నీరు, అభయారణ్యం సందర్శకులను కట్టిపడేస్తాయి. వైపర్ ఐలాండ్‌లో చారిత్రక ప్రాంతాలతో పాటు అద్భుతమైన పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి. వైవిధ్యమైన సంస్కృతి, భాషా ప్రజలను ఇక్కడ చూడొచ్చు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version