Budget 2026
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా.. భారత్ 7 శాతం వృద్ధి రేటుతో స్థిరంగా దూసుకుపోతోందని ఆమె ప్రకటించారు. మొత్తంగా ఈ ఏడాది బడ్జెట్(Budget 2026) ప్రధానంగా ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు , హైటెక్ పరిశ్రమల అభివృద్ధిపైన దృష్టి సారించినట్లు తేలింది.
తెలుగు రాష్ట్రాలకు ‘హైస్పీడ్’ జోష్.. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే రంగం నుంచి భారీగానే కేటాయింపులు అందాయి. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మార్గాలు ఉండటం శుభపరిణామం.
ముఖ్యమైన కారిడార్లు.. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించబోతున్నారు.
వందే భారత్ విస్తరణ-ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వందే భారత్ రైళ్లకు తోడుగా, త్వరలో మరిన్న వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
బుల్లెట్ రైలు ప్రతిపాదన.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ,హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదనపై కూడా ముందడుగు పడటం విశేషం..
ఏపీకి ‘రేర్ ఎర్త్’ మ్యాజిక్- తెలంగాణకు టెక్స్‌టైల్ ఊతం..
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళలో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ (Rare Earth Corridors) అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల ఏపీలో మైనింగ్ , ప్రాసెసింగ్ రంగాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి.
మరోవైపు, దేశవ్యాప్తంగా మెగా టెక్స్‌టైల్ పార్కులు, ఖాదీ, హ్యాండ్లూమ్ ప్రోత్సాహానికి ‘మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్’ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు అందుతాయి.
అలాగే బడ్జెట్ 2026(Budget 2026)లో మరికొన్ని ముఖ్యాంశాలు ..
సెమీకండక్టర్ మిషన్ 2.0.. దేశాన్ని చిప్ తయారీ హబ్‌గా మార్చడానికి రూ. 40,000 కోట్లు కేటాయించారు.
బయో ఫార్మా శక్తి.. ఫార్మా రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడానికి రూ. 10,000 కోట్లతో కొత్త పథకం.
మౌలిక సదుపాయాలు.. మౌలిక వసతుల కల్పనకు రూ. 12.2 లక్షల కోట్ల భారీ కేటాయించారు.
జలమార్గాలు.. వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయబోతున్నారు.
ఎన్నారైలకు ఊరట.. భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పరిమితిని పెంచుతూ ఎన్నారైలకు శుభవార్త చెప్పారు.
బడ్జెట్ 202(Budget 2026)6లో సామాన్యుడికి ఏంటి లాభం అంటే సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్న ఈ బడ్జెట్‌లో.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (MSME) కోసం రూ. 12,000 కోట్లకు పైగా కేటాయించడం . దీనివల్ల స్థానికంగా చాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే గతంలో 375 వస్తువులపై జీఎస్‌టీ తగ్గించడం వల్ల నిత్యావసరాలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.
