Cyber Fraud: సైబర్ మోసానికి గురైన రిటైర్డ్ ఐజీ.. తుపాకీతో ఆత్మహత్యాయత్నం

Cyber Fraud: అప్పులు తిరిగి చెల్లించలేని స్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు ఆ లేఖ ద్వారా అర్థం అవుతోంది.

Cyber Fraud

కాదెవరూ సైబర్ మోసాని(Cyber Fraud)కి అనర్హం అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి.. ఎందుకంటే నిరక్షరాస్యులనే కాదు ఎన్నో అత్యున్నత చదువులు చదివినవ వారిని కూడా సైబర్ కేటుగాళ్లు చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. అయితే ఇక్కడ మోసపోయిన వారిదే తప్పు అనేలా ఉంటోంది పరిస్థితి.. పైగా సదరు వ్యక్తి నిత్యం ప్రజలను ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తం చేసే పోలీసు శాఖకు చెందిన వ్యక్తి అయితే మోసం చేసిన వారిది తప్పులేదా అన్న వాదనా వినిపిస్తోంది.

సునాయాసంగా వచ్చే డబ్బు నిలవదన్న విషయం తెలిసీ , అత్యాశకు పోయి పెట్టుబడలు పెట్టి వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగా కోట్లలో మోసపోయాడు పంజాబ్ కు చెందిన రిటైర్డ్ ఐజీ అమర్ సింగ్ చాహల్.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై ఏకంగా రూ. 8.10 కోట్లు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి, ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ప్రస్తుతం ఈ (Cyber Fraud)ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సెక్యూరిటీ గార్డు తుపాకీతో తన ఛాతీలో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా.. గమనించిన సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్యాయత్నానికి ముందు అక్కడ రాసిన 12 పేజీల లేఖ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.

ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. లేఖలో తాను సైబర్ మోసానికి గురైన విషయం గురించి ఆయన రాసుకొచ్చారు. వెల్త్ అడ్వైజర్స్ పేరుతో భారీ మోసానికి గురైనట్లు వెల్లడించారు. సెబీ గుర్తింపు పొందిన సంస్థగా పరిచయం చేసుకున్న సైబర్ కేటుగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా తనను సంప్రదించారని తెలిపారు. రెండునెలల క్రితం పరిచయం ఏర్పడిందనీ, అధిక లాభాలు వస్తాయని నమ్మించారని సూసైడ్ లేఖలో రాసుకొచ్చారు.

Cyber Fraud

భారీ లాభాలకు ఆశపడి తాను కోటి రూపాయల సొంత డబ్బును పెట్టానని, తర్వాత బంధువుల దగ్గర మరో రూ.7.10 కోట్లు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్టు వివరించారు. ఆన్ లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు సూచించిన పలు అకౌంట్లకు దశల వారీగా చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించానని, అప్పటికే పరిస్థితి చేజారిపోయిందన్నారు. అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోనే మానసిక వేదనకు గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.

అప్పులు తిరిగి చెల్లించలేని స్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు ఆ లేఖ ద్వారా అర్థం అవుతోంది. తన చావుకు సైబర్ థగ్స్ కారణమని లేఖలో పేర్కొన్న అమర్ సింగ్ చాహల్.. ఈ లేఖను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఉద్దేశించి రాశారు.

అయితే ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి సైబర్ మోసాని(Cyber Fraud)కి గురవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధిక డబ్బు వస్తుందంటే ఎవరూ అతీతులు కాదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులు ఈ సైబర్ ముఠాను పట్టుకునే పనిలో ఉన్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version