Tejas fighter jet: ఎయిర్ షోలో భారత తేజస్ యుద్ధ విమానం ప్రమాదం..భారత్ ముందున్న సవాల్ ఏంటి?

Tejas fighter jet: దుబాయ్ ఎయిర్ షో (Dubai Air Show)లో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ (LCA - Light Combat Aircraft) యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది.

Tejas fighter jet

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక దుబాయ్ ఎయిర్ షో (Dubai Air Show)లో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ (LCA – Light Combat Aircraft) యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.

తేజస్ విమానం(Tejas fighter jet) కుప్పకూలడంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో ఎయిర్ షోను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు (Emergency teams) సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తేజస్ యుద్ధ విమానం (Tejas fighter jet)పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో (Indigenously Developed) భారతదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం. ఈ విమానాన్ని భారత రక్షణ రంగం ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో దుబాయ్ ఎయిర్ షోకు తీసుకువచ్చింది.

ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ యొక్క పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాద తీవ్రతను బట్టి, పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తొలుత భావించారు.

Tejas fighter jet

తేజస్ విమానం(Tejas fighter jet) కుప్పకూలడానికి కొద్ది క్షణాల ముందు, అందులోని పైలట్ సమయస్ఫూర్తితో ఎజెక్ట్ (Eject) అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు పైలట్‌ను గుర్తించాయి. పైలట్‌కు చిన్నపాటి గాయాలు మాత్రమే అయినట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి సురక్షితంగా ఉన్నట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం (IAF) , హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా విచారణకు ఆదేశించాయి. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు (సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదమా) పూర్తి విచారణ తర్వాత తెలియాల్సి ఉంది.

దుబాయ్ ఎయిర్ షో వంటి అంతర్జాతీయ వేదికలు తేజస్ విమానాల(Tejas fighter jet)ను విదేశీ కొనుగోలుదారులకు ప్రదర్శించడానికి, ఎగుమతి మార్కెట్‌ను పెంచడానికి ఉద్దేశించినవి. తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన దేశాలు (ఉదాహరణకు, మలేషియా, అర్జెంటీనా) ఈ ప్రమాదం తర్వాత విమానం యొక్క సామర్థ్యం మరియు భద్రత గురించి పునరాలోచించే అవకాశం ఉంది.

అయితే అభివృద్ధి చెందిన దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే తేజస్ (Tejas fighter jet)ఇప్పటికీ దాని అంతర్జాతీయ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన ప్రదర్శనలో ప్రమాదం జరగడం వల్ల, విమానం యొక్క విశ్వసనీయత (Reliability) మరియు సాంకేతిక పరిజ్ఞానంపై విదేశీ కస్టమర్లలో సందేహాలు పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో తేజస్‌(Tejas fighter jet)కు పోటీగా ఉన్న విమానాలను తయారు చేసే దేశాలు ఈ ప్రమాదాన్ని తమ ప్రచారానికి ప్రతికూల అంశంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇటు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానం కావడం వల్ల, పరిశోధన , అభివృద్ధి (R&D) బృందాలపై ఈ ప్రమాదానికి గల కారణాలను త్వరగా గుర్తించి, లోపాలను సరిదిద్దాలనే తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇప్పటికే ఉన్న ఇతర R&D ప్రాజెక్టుల పురోగతిని ఆలస్యం చేయొచ్చు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు DRDO వంటి సంస్థలలో తేజస్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యం తాత్కాలికంగా దెబ్బతినొచ్చు.

తేజస్ భారత ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి చిహ్నం. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు, విమానం రూపకల్పన (Design), ఇంజనీరింగ్ లేదా తయారీ ప్రక్రియలలో లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలు దేశీయంగా లేవనెత్తుతాయి, ఇది R&D ప్రక్రియపై సందేహాలను పెంచుతుంది.

విమానం మరమ్మత్తు లేదా పునఃనిర్మాణం కోసం అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి, లోపాలను సరిదిద్దడానికి అధిక నిధులు కేటాయించాల్సి వస్తుంది. అలాగే విమానం యొక్క భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడానికి, లోపాలను పరిష్కరించడానికి అవసరమైన పరీక్షలు ,సర్టిఫికేషన్ ప్రక్రియలు తిరిగి నిర్వహించాల్సి రావడం వల్ల, భవిష్యత్తు ఉత్పత్తి , తేజస్ మార్క్-2 (Tejas Mark-2) వంటి తదుపరి వెర్షన్ల అభివృద్ధిలో ఆలస్యం జరగవచ్చు.

ఈ ప్రమాదం వల్ల తాత్కాలికంగా ప్రతికూల ప్రభావాలు ఉన్నాకూడా, రక్షణ పరిశోధనలో ఇలాంటి వైఫల్యాలు ఎదురవడం సహజం. పూర్తి విచారణ జరిపి, లోపాలను సరిదిద్దడం ద్వారా మాత్రమే తేజస్ దాని పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతుంది

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version