Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న జగదీప్ ధన్‌ఖడ్ ..కారణం అదేనా?

Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) జగదీప్ ధన్‌ఖడ్ (74) అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Dhankhar:భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) జగదీప్ ధన్‌ఖడ్ (74) అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. 2022, జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్, తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

Jagdeep Dhankhar resigns as Vice President

రాజీనామా లేఖలో “ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్యుల సలహాను పాటించడానికి” తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా.. “కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలు” ( health issues) కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు.అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ రాజీనామా జరగడంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) 1951, మే 18న జన్మించారు. ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో 1978–1979 కాలంలో న్యాయ విద్యను అభ్యసించారు. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ధన్‌ఖడ్, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు.ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1989–1991 మధ్య లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 1990-91 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019–2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామాతో దేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. దీనికితోడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు కాబట్టి, రాజ్యసభ అధ్యక్ష స్థానం కూడా ఖాళీ అవుతుంది.

రాజ్యాంగం ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, వీలైనంత త్వరగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలికంగా రాజ్యసభ ఛైర్మన్ బాధ్యతలను నిర్వర్తిస్తారు.మొత్తంగా ధన్‌ఖడ్ రాజీనామాతో ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Jagdeep Dhankhar

 

Exit mobile version