Kartavya Bhavan :ఢిల్లీకి కొత్త వన్నె తెచ్చిన కర్తవ్య భవన్..ఏంటి దీని ప్రత్యేకత

Kartavya Bhavan:దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు సైన్ బోర్డ్ మారింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన (PM Modi inauguration)‘కర్తవ్య భవన్’

Kartavya Bhavan

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు సైన్ బోర్డ్ మారింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన (PM Modi inauguration)‘కర్తవ్య భవన్’ (Kartavya Bhavan)ఇప్పుడు దేశం కోసం పనిచేసే అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు కొత్త చిరునామా అయ్యింది.

పాత కేంద్ర సచివాలయ భవనాలు ఎంతో పాతవి, సరైన వసతులు లేకపోవటంతో అధికారులకు, మంత్రులకు ఇబ్బందులు వచ్చేవి. ఒక శాఖ భవనం ఒకచోట, మరొక శాఖ వేరే చోట ఉండటంతో పని సమన్వయం కష్టమయేది.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పథకంలో భాగంగా సరికొత్త సచివాలయాన్ని నిర్మించింది. 2025లో పనులు పూర్తి చేసి, ఆగస్టు 6న ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు.

Kartavya Bhavan

ముందునుంచి ఢిల్లీలో ప్రాంతంలో ఏకంగా 50కి పైగా భవనాల్లో విభజించబడి భిన్న శాఖలు పనిచేస్తుండేవి. ఇప్పుడు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, అన్ని మంత్రుల ఛాంబర్లు ఒకే ‘కర్తవ్య భవన్’లో ఉంటాయి.

మంత్రులు, అధికారులు ఒకేచోట ఉండడంతో తక్షణ సంబంధాలు, చర్చలు వేగంగా జరుగుతాయి. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం పెరిగింది.

ఈ భవనం అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. మొత్తం భవనం లైట్లతో, ప్రకృతి దృశ్యాలతో, గ్రీన్ స్పేస్ కూడా ఉంది.

సెక్యూరిటీ పరంగా ఆధునిక సాంకేతిక వసతులతో అద్భుత రక్షణ. ప్రతి శాఖకు ప్రత్యేక మీటింగ్ రూములు, అంతస్తుల వారీగా తీర్చిదిద్దిన కార్యాలయ ఏర్పాటయింది.అలాగే అన్ని శాఖలు ఒకేచోట ఉండడం వల్ల జన ప్రయాణం సులభం, ప్రభుత్వ ఖర్చులు కూడా కొంత తగ్గుతాయి.

ఢిల్లీ వీధుల్లో యాక్యూరేట్ చిరునామా, తొందరగా మ్యాటర్ క్లోజ్ చేసే పాలన, కొందరు శాఖలకు మధ్య చేరాలంటే గంటలు పడేవి అనే ఫీలింగ్ ఇక తగ్గింది. బహుళ శాఖల పని సమయాన్ని, సమన్వయాన్ని కొత్తగా రూపకల్పన చేస్తూ, పాలన కంటైనర్‌గా వెలిగేలా చేసింది.

కర్తవ్య భవన్ (Kartavya Bhavan)కేవలం ఒక భవనం కాదు..కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు కొత్త శకం. అధికారాలు, పనితీరు ఇంకా వేగవంతం కావడమే లక్ష్యం. ఇకపై దేశపీటమీద పాలనా వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేయబోతుందనడంలో అనుమానం లేదు.

 

Exit mobile version