Independence Day
మనం 79వ స్వాతంత్ర్య దినోత్సవం(79th Independence Day) జరుపుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో, మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, వారు నడిపిన పోరాటాలను గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. భారత స్వాతంత్య్రోద్యమం(Independence Day)లో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఘట్టం “చంపారణ్ సత్యాగ్రహం”.
అది 1917వ సంవత్సరం. బీహార్‌లోని చంపారణ్ ప్రాంతంలో రైతులు బ్రిటిష్ పాలకుల అన్యాయానికి బలైపోతున్నారు. ‘టీన్‌ఖథియా’ అనే దుర్మార్గమైన విధానం ద్వారా, రైతులు తమ భూమిలో కొంత భాగంలో తప్పనిసరిగా నీలిమందు (Indigo) పండించాలని బ్రిటిష్ యాజమాన్యం నిర్బంధించేది.
ఈ పంట పండించడం వల్ల భూమి సారం కోల్పోవడమే కాకుండా, లాభాలు కూడా వారికి దక్కేవి కావు. దీంతో రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో వారు కొట్టుమిట్టాడారు.
ఇదే సమయంలో, దక్షిణ ఆఫ్రికాలో విజయవంతంగా సత్యాగ్రహాన్ని ప్రయోగించి వచ్చిన మహాత్మా గాంధీ చంపారణ్‌కు చేరుకున్నారు. అక్కడ గాంధీ రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి గ్రామాలను సందర్శించారు, ప్రజల నుంచి సాక్ష్యాలను సేకరించారు. గాంధీ రాకతో రైతుల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ఆయన ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం మొదలుపెట్టారు.
గాంధీ మార్గంలో, ఎలాంటి హింసకు తావు లేకుండా, కేవలం శాంతియుత నిరసనలు, సత్యాగ్రహాలు నిర్వహించారు. మొదట గాంధీని అడ్డుకోవాలని ప్రయత్నించిన బ్రిటిష్ అధికారులు, చివరికి రైతుల సమస్యలను అంగీకరించక తప్పలేదు. ఈ ఉద్యమ విజయం భారత స్వాతంత్య్రోద్యమానికి (Independence Day)ఒక కొత్త మార్గాన్ని చూపించింది. శాంతియుతంగా, ఐక్యంగా పోరాడితే విజయం సాధించవచ్చని ఈ ఘటన నిరూపించింది.
చంపారణ్ సత్యాగ్రహం(Champaran Satyagraha) స్ఫూర్తితో, దేశవ్యాప్తంగా అనేక చారిత్రక ఘట్టాలు జరిగాయి.మన స్వాతంత్య్రాన్ని సాధించడంలో మరికొన్ని కీలక ఘట్టాలుగా మారాయి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ (Jallianwala Bagh )దురంతం 1919లో జరిగిన హృదయ విదారక ఘటన.. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఒక కీలక మలుపు తిప్పింది. అమాయకులపై జరిగిన ఈ కాల్పులు ప్రజల్లో బ్రిటిష్ పాలకులపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.
ముస్లింలు కూడా స్వాతంత్య్రోద్యమంలో భాగమై, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్యత చూపిన ఒక చారిత్రక సంఘటన జరిగింది. 1920లో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీ చేపట్టిన దండి సత్యాగ్రహం (1930) శాంతియుత పోరాటం దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది.
1942లో క్విట్ ఇండియా నినాదంతో బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి దేశం మొత్తం ఐక్యంగా నిలబడిన చారిత్రక పోరాటంగా నిలిచింది.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర్యం జరుపుకునే సమయంలో, ఈ చారిత్రక ఘట్టాలను, వాటి వెనుక ఉన్న మహానుభావుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. వారి పోరాటాలు, త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ. ఈ స్వాతంత్ర్య దినోత్సవం మనకు సమానత్వం, న్యాయం, శాంతి కోసం పోరాడాలనే సంకల్పాన్ని నింపుతుంది.