Rahul : పార్లమెంట్ వేదికగా జరిగిన “ఆపరేషన్ సిందూర్” చర్చలో అనూహ్యంగా అన్ని లైమ్లైట్ రాహుల్ గాంధీ మీదే పడ్డాయి. భారత ప్రధాని మోదీ తరచూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ తన దూకుడు చూపిస్తుంటారు. కానీ ఈసారి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నల ముందు మోదీ మౌనం దాల్చడం హాట్ టాపిక్ అయింది.
Rahul
ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎదుటివారు నోరెత్తనీకుండా మాట్లాడే వక్త అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితులలో అయినా దూకుడుగా మాట్లాడే నేత. విమర్శలకు ఘాటు కౌంటర్లిచ్చే రాజకీయ నేత. అయితే ఆయన తీరు ఇటీవల పూర్తిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓ వైపు పాకిస్తాన్‌పై మంటలు పేల్చినా, మరోవైపు ట్రంప్ జోక్యంపై కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు మూగబోయారని చర్చ సాగుతోంది.
పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ చర్చలో ప్రధాని మోదీ(Narendra Modi) పాక్‌ను ఉగ్రవాద దేశంగా గట్టిగా నిలదీశారు. పాక్ ఓడిపోతే కొంతమందికి దుఃఖం.. దేశవిరోధి వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నారంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. రాహుల్, ప్రియాంక ప్రశ్నలకు జవాబివ్వలేక సైలెన్స్‌ను ఆశ్రయించడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
శ్వేత దేశాధ్యక్షుడు ట్రంప్ తానే పాక్, భారత్ మధ్య జోక్యం చేసుకుని యుద్ధం ఆపానంటూ చెబుతున్నారు..కానీ అది నిజం కాదని మీరంటున్నారని అడిగిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆయన అబద్ధం చెబుతున్నాడని మోదీ పార్లమెంట్లోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేశానికి క్లారిటీ ఇవ్వాలని.. మీపై ఎలాంటి ఒత్తిడి లేదన్నది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడే మీరు బలమైన నాయకుడిగా నిలిచే అవకాశం అదని గట్టిగా ప్రశ్నించారు
ప్రియాంక గాంధీ కూడా అదే లైన్ కొనసాగించి మోదీపై దూకుడు కొనసాగించారు. నమ్మకంగా ఉండే నేతను మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు అని మోదీని సూటిగా ప్రశ్నించారు. అయితే అన్నాచెల్లెళ్ల ఎదురుదాడిలో మోదీ ఎందుకు మాట్లాడలేదన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది.
ట్రంప్ జోక్యం లేదని పార్లమెంట్ సాక్షిగా ;ప్రధాని మోదీ ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో అగ్రెసివ్‌గా ఉండే మోదీ.. ఎందుకు డిఫెన్స్‌లో పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అన్నట్లు ఇందిరా గాంధీ వంటి నేతలా మాట్లాడే ధైర్యం మోదీకి లేదా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.