Trip నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేశారా? తప్పక సందర్శించాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే..

Trip ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి నవంబర్ నెలలో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి చుట్టేసి రావడానికి బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి.

Trip

నవంబర్ నెలలో చాలా మంది ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ మాసంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి నవంబర్ నెలలో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి చుట్టేసి రావడానికి బెస్ట్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి.

1. జైపూర్, రాజస్థాన్ (Jaipur, Rajasthan).. నవంబర్ నెలలో ఉత్తర భారతదేశంలోని వేడి తగ్గిపోయి, వాతావరణం చాలా అద్భుతంగా, చల్లగా మారుతుంది. పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన జైపూర్ ఈ చల్లటి ఉష్ణోగ్రతతో ప్రాణం పోసుకుంటుంది. ఈ మాసంలో జైపూర్‌లోని అద్భుతమైన కట్టడాలైన అంబర్ కోట (Amber Fort), హవా మహల్ (Hawa Mahal) , ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించడం (Trip)చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ సమయంలో జైపూర్‌లో నిర్వహించే సాహిత్య ఉత్సవం (Literature Festival) వంటి సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులకు మరింత ఆనందాన్ని ఇస్తాయి.

2. వారణాసి, ఉత్తర్ ప్రదేశ్ (Varanasi, Uttar Pradesh).. మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతన కోరుకొనే వారికి నవంబర్ నెలలో వారణాసిని సందర్శించడం(Trip) ఉత్తమం. ఈ మాసంలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పవిత్రమైన గంగా నది కనుమల నుంచి వచ్చే ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభూతి చెందొచ్చు. తెల్లవారుజామున చేసే సూర్యోదయ పడవ ప్రయాణాలు, సాయంత్రం వేళల్లో జరిగే కనుల పండువైన గంగాహారతిని వీక్షించడం మనసుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను చేకూరుస్తుంది.

3. హంపి, కర్ణాటక (Hampi, Karnataka).. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన హంపి, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. విజయనగర సామ్రాజ్యం యొక్క ఈ పురాతన రాజధాని శిథిలాలు అలాగే అద్భుతమైన విరూపాక్ష దేవాలయంతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నవంబర్ నెలలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటమే కాకుండా, ఈ మాసంలో ఇక్కడి రాతి ప్రకృతి (Rocky Landscape) , తుంగభద్ర నది పరిసరాలు పర్యాటకులకు కనుల విందునందిస్తాయి. అందువలన నవంబర్‌ నెలలో తప్పక పర్యటించాల్సిన చారిత్రక ప్రదేశాల్లో హంపి కూడా ఒకటి.

Trip

4. రిషికేశ్, ఉత్తరాఖండ్ (Rishikesh, Uttarakhand).. అద్భుతమైన పచ్చటి ప్రకృతి, ఎత్తైన కొండలతో నిండిన రిషికేశ్ సాహస ప్రియులకు (Adventure Lovers) బెస్ట్ ప్లేస్. ముఖ్యంగా నవంబర్ నెలలో ఇక్కడ వాతావరణం రివర్ రాఫ్టింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహస కార్యకలాపాలకు అత్యంత అనువైనదిగా మారుతుంది. చల్లటి వాతావరణంలో రివర్ రాఫ్టింగ్ థ్రిల్‌ను అనుభవించాలనుకునే వారికి ఇది ఉత్తమ సమయం. అలాగే, యోగా మరియు ధ్యానం కోసం యోగా రిట్రీట్‌లకు కూడా ఈ మాసం అనువైనది.

Trip

5. కూర్గ్, కర్ణాటక (Coorg, Karnataka).. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన కూర్గ్, కర్ణాటకలోని మరో అద్భుతమైన హిల్ స్టేషన్. అందమైన కొండలు, దట్టమైన పచ్చటి చెట్లు మరియు సువాసనభరితమైన కాఫీ తోటలతో ఈ ప్రదేశం కనులవిందుగా ఉంటుంది. నవంబర్ నెలలో పగటి ఉష్ణోగ్రత సుమారు 20-25 డిగ్రీల మధ్య ఉండటం వలన ఇక్కడ ప్రయాణం చేయడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే నవంబర్ నెలలో ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version