Priyanka : పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంధించిన సంచలన ప్రశ్నలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను నేరుగా లక్ష్యంగా చేసుకుని, వారి గుండెల్లో గునపాలు దించినట్లయ్యాయి. అవును ..ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చలో ఆమె అడిగిన ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
Priyanka
పీఎం మోదీ ఆపరేషన్ సిందూర్ విజయానికి శ్రేయస్కులు కావాలనుకుంటే, దానికి బాధ్యత కూడా తీసుకోవాలంటూ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ(Narendra Modi)పై సూటిగా దాడి చేశారు. ఈసారి యుద్ధం ముగిసిందని ప్రకటించింది మన సైన్యం కాదు, అమెరికా అధ్యక్షుడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రధాని బాధ్యతారాహిత్యమంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “భారత్ ఇప్పుడు అంత బలహీనంగా మారిపోయిందా? మన యుద్ధాన్ని మరొక దేశ నాయకుడు ఆపుతున్నాడా?” అంటూ ప్రధానిని నేరుగా టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు.
“ట్రంప్ కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించిన తర్వాతే మన ప్రభుత్వం స్పందించిందా? ఒక విదేశీ నాయకుడు ముందే మన సైనిక చర్య గురించి వార్త చెబితే… మన దేశ గౌరవం ఎక్కడ ఉంది? మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారా? మిలిటరీ ఆపరేషన్‌లు కూడా రాజకీయ ప్రణాళికలకే పరిమితమైపోతున్నాయా?” అంటూ ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ భద్రత, విదేశీ జోక్యం, పాలన సామర్థ్యం వంటి అత్యంత సున్నిత అంశాలపై ఆమె ప్రశ్నలు సంధించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు.
ఇలా ప్రియాంక గాంధీ ప్రశ్నించిన తీరు చూస్తుంటే, ఆమెలో ఇందిరా గాంధీ ఛాయలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. దేశ సార్వభౌమాధికారంపై ఇందిరా గాంధీ చూపినంత దృఢత్వాన్ని ప్రియాంక కూడా చూపుతున్నారని, ఇది ఆమెను నిజమైన ఇందిరమ్మ వారసురాలిగా నిలబెడుతుందని అంటున్నారు. ఈ ప్రియాంక ప్రశ్నలు పార్లమెంట్‌లో ఉద్రిక్తత పెంచడమే కాకుండా, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అమలు తీరు, దాని వెనుక ఉన్న రాజకీయ కోణాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.