Priyanka: దేశాన్ని ప్రేమించడానికీ రిజిస్టర్ చేయించుకోవాలా..? పాయింటే కదా మరి..

Priyanka: దేశభక్తిని కొలిచే హక్కు మీకెక్కడినుంచి వచ్చిందని ప్రియాంక సూటి ప్రశ్న

Priyanka

దేశాన్ని  ప్రేమించడానికr మీ అనుమతి అవసరమా?..దేశభక్తికి మీరు సర్టిఫికెట్లు ఇచ్చే స్థాయిలో లేరు!

ఎవరు నిజమైన భారతీయుడో, ఎవరు దేశభక్తుడో నిర్ణయించేది మీరు కాదూ.. కోర్టులు కూడానూ కాదు.

మా సోదరుడు రాహుల్ గాంధీ దేశాన్ని విమర్శిస్తే, అది దేశద్రోహమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా? దేశాన్ని ప్రేమించడం కోసం మేం మీతో రిజిస్టర్ చేయించుకోవాలా? ఇవన్నీ ఢిల్లీ వేదికగా ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) మాట్లాడిన మాటలు..

అవును..ప్రియాంక గాంధీ మంగళవారం మీడియా ముందు కోపంతో ఊగిపోతూ ఈ కామెంట్లు చేశారు . కోపంలోనూ ఒక్క మాట తప్పుగా మాట్లాకుండా మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్‌గా మాట్లాడుతూ సీనియర్లు కూడా విస్తుపోయేలా చేశారు.

అంతేకాదు.. తానేమీ నెమ్మదిగా మాట్లాడే రాజకీయ నేత కాదని, తమ కుటుంబ దేశభక్తిని.. రాజకీయంగా తిట్టుకునేంత తక్కువస్థాయికి తీసుకువెళ్లొద్దని బీజేపీకి హెచ్చరికలు కూడా జారీ చేశారు

కొద్దిసేపటిక్రితమే ..రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత సాయుధ బలగాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమిటో విచారించాలని సూచించింది.

దాంతో, అధికార బీజేపీ నేతలు ..దేశాన్ని అపహాస్యం చేస్తే ఇదే జరుగుతుంది, రాహుల్ దేశభక్తిపై బహుళ సందేహాలున్నాయంటూ మరోసారి రాజకీయ దాడికి దిగారు. కానీ ఈసారి వారి మాటలు ఊహించినంత సులభంగా సాగలేదు.

ప్రియాంక గాంధీ నేరుగా ప్రత్యర్థులపై విమర్శల దాడికి దిగారు.

రాహుల్ గాంధీ సైన్యాన్ని ప్రేమించని వాడైతే, మా ఇంట్లఎవ్వరూ దేశాన్ని ప్రేమించే వాళ్లే కాదన్నట్టే. మన నాన్న రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అది మర్చిపోవడం మీకు సులువు కావచ్చు.. కానీ దేశం మర్చిపోలేదు!” అంటూ ఆమె బలంగా స్పందించారు.

గతంలోనూ ఇలాగే ఆరోపణలు రాహుల్ గాంధీపై వచ్చాయి.

2019లో ఆయన పౌరసత్వం కోణంలో బీజేపీ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కూడా ప్రియాంక (priyanka)గట్టిగా బదులిచ్చారు.

ఇక్కడే పుట్టినవాడు, దేశం ఎదుగుదల కోసం రోజూ గొంతు పెడుతున్న వాడిని విదేశీ అనడం విడ్డూరం కాదు మేమైతే చరిత్రని సూటిగా తుడిచేయాలని చూస్తున్నట్లు ఉందని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే స్టైల్‌లో వాదించారు.

ప్రియాంక గాంధీ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న తీరు చూస్తే, గతంలో ఆమెను కుటుంబ రాజకీయాల వారసురాలు అని చిన్నచూపు చూసినవారు కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెలో తన నాన్నమ్మ ఇందిరాగాంధీ(Indira Gandhi legacy) తీరూ, ధైర్యం స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

Exit mobile version