Modi and Priyanka: వైరల్ అవుతోన్న మోదీ-ప్రియాంక ఫోటోలు ..పార్లమెంట్‌లో నిప్పులు..టీ మీట్‌లో నవ్వుల వెనుక కథేంటి?

Modi and Priyanka :శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సంప్రదాయ టీ మీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Modi and Priyanka

భారత రాజకీయాల్లో ఎప్పుడూ వేడివేడి చర్చలు, ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ప్రతి విమర్శలే మనకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య వాతావరణం నిప్పులు చెరుగుతున్నట్లు ఉంటుంది. అయితే, సభ ముగిసిన తర్వాత అదే నేతలు(Modi and Priyanka) ఒకే చోట కూర్చుని, టీ కప్పు పట్టుకుని చిరునవ్వులు చిందించడం చూస్తే.. “రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు” అనే విషయం అర్థమవుతుంది.

తాజాగా శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సంప్రదాయ టీ మీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే ఫ్రేమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ,కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Modi and Priyanka) నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించడమే దీనికి కారణం.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ప్రతిపక్షం నుంచి ప్రియాంక గాంధీ, సుప్రియా సూలే, డి. రాజా వంటి హేమాహేమీలు పాల్గొన్నారు. సభలో ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకున్న నేతలు, ఇక్కడ మాత్రం చాలా లైట్ మూడ్‌లో కనిపించారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా తన మొదటి పార్లమెంట్ సెషన్‌ను ముగించుకుని ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన ఒక సరదా సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది. వయనాడ్‌లో దొరికే ఒక ప్రత్యేకమైన హెర్బ్ (జడి) గురించి ప్రియాంక ప్రస్తావించారట. అది తీసుకోవడం వల్లే తనకు ఇక్కడ అలర్జీలు తగ్గాయని ఆమె చెబుతుంటే, ఎదురుగా కూర్చున్న మోదీ, రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ పగలబడి నవ్వారట.

కేవలం ఆరోగ్య విషయాలే కాకుండా, ప్రధాని మోదీ ఇటీవల చేసిన విదేశీ పర్యటనల గురించి కూడా ప్రియాంక ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈథియోపియా, జోర్డాన్,ఓమాన్ పర్యటనలు ఎలా జరిగాయని ఆమె అడిగినప్పుడు, మోదీ చాలా సానుకూలంగా స్పందిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు.

ఇదే మీటింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ చేసిన ఒక వ్యాఖ్యకు మోదీ ఇచ్చిన రిప్లై అందరినీ నవ్వించింది. “వింటర్ సెషన్ ఇంకొన్ని రోజులు పెంచాల్సింది కదా” అని ధర్మేంద్ర యాదవ్ అన్నప్పుడు.. “సభలో మీ లౌడ్ స్పీచ్ వింటూ ఉంటే నా గొంతే బాగుండదు, అందుకే ఇంతటితో ముగించాం” అని మోదీ జోక్ చేయడంతో ఛాంబర్ అంతా నవ్వులతో నిండిపోయిందట.

Modi and Priyanka

అయితే, ఇదే ప్రియాంక గాంధీ సభలో మోదీ (Modi and Priyanka)ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కదా, మరి ఇక్కడ ఇంత సాఫ్ట్ గా ఎలా ఉన్నారు? అని ఈ టీ మీట్ ఫొటోలు చూసిన సామాన్యులకు ఒక సందేహం రావచ్చు.. నిజానికి ప్రియాంక తన మొదటి స్పీచ్ లోనే అదరగొట్టారు. “ప్రజల సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదు, చర్చకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడమే అసలైన డ్రామా” అంటూ మోదీకి పదునైన కౌంటర్ ఇచ్చారు.

సంభాల్ హింస, యూనావో అంశం , రైతుల సమస్యలపై ఆమె చేసిన ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో “విభేదిస్తాం.. కానీ శత్రువులం కాదు” (Disagree but not enemies) అనే సంప్రదాయం ఉంది. అదే సంప్రదాయాన్ని ఈ టీ మీట్ ప్రతిబింబించింది.

ప్రియాంక గాంధీ ఇప్పుడు పూర్తిస్థాయి పార్లమెంటరీ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారని ఈ మీట్ స్పష్టం చేస్తోంది. అటు సభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, ఇటు సంప్రదాయ సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికార పార్టీ అగ్ర నేతలతో డైరెక్ట్ రాపోర్ట్ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఆమె తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు.

ఈ(Modi and Priyanka) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. “నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదే” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, ఢీ అంటే ఢీ అన్నట్లు సాగిన శీతాకాల సమావేశాలు.. చివరకు టీ కప్పుతో, చిరునవ్వులతో సుఖంతం అవ్వడం ఒక మంచి పరిణామం అంటున్నారు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version