Coaches: భారత రైల్వేలో కోచ్‌ల రంగుల రహస్యం

Coaches:మనం తరచుగా చూసే నీలం, ఎరుపు, ఆకుపచ్చ కోచ్‌లు దేన్ని సూచిస్తాయో తెలుసుకుందాం.

Coaches

ప్రయాణం కోసం రైలును ఎంపిక చేసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే, రైలు కోచ్‌ల(Coaches)ను గమనిస్తే వాటిపై ఉండే వివిధ రంగుల వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. మనం తరచుగా చూసే నీలం, ఎరుపు, ఆకుపచ్చ కోచ్‌లు దేన్ని సూచిస్తాయో తెలుసుకుందాం.

సాధారణంగా మనం నీలం రంగులో ఉండే కోచ్‌లను చూస్తుంటాం. వీటిని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కోచ్‌లు అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా ఎక్స్ ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కనిపిస్తాయి. ఈ కోచ్‌లలో సాధారణంగా గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇవి ఎయిర్ బ్రేక్‌లతో అమర్చబడి ఉంటాయి.

మరోవైపు, ఎరుపు రంగు కోచ్‌లు వేగం ఆధునికతకు ప్రతీక. వీటిని లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) అని పిలుస్తారు. ఇవి 2000వ సంవత్సరంలో జర్మనీ నుండి దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లోని కపుర్తలాలో వీటిని తయారు చేస్తున్నారు.

Coaches

ఈ కోచ్‌లు(Coaches) అల్యూమినియంతో తయారు చేయబడి, బరువు తక్కువగా ఉంటాయి. ఇవి డిస్క్ బ్రేకులతో 200 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించగలవు. ఈ కోచ్‌లను ప్రధానంగా రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటి హై-స్పీడ్ రైళ్లలో ఉపయోగిస్తారు. ఇక, గరీబ్‌రథ్ రైళ్లకు ఆకుపచ్చ కోచ్‌లను ఉపయోగిస్తారు. వీటితో పాటు మీటర్‌గేజ్ రైళ్లకు బ్రౌన్ రంగు క్యారేజీలు, నారో-గేజ్ రైళ్లకు లేత రంగు క్యారేజీలు ఉండేవి. ఇప్పుడు దేశంలో నారో-గేజ్ రైళ్లు దాదాపుగా సేవలో లేవు.

కోచ్(Coaches) రంగులతో పాటు, వాటిపై ఉండే చారలు కూడా కొన్ని కీలకమైన సమాచారాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు, నీలిరంగు కోచ్‌లపై తెల్లటి చారలు అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్‌లను సూచిస్తాయి. అలాగే, గ్రే రంగు కోచ్‌లపై ఉండే ఆకుపచ్చ చారలు మహిళల కోసం కేటాయించిన బోగీలను సూచిస్తాయి. ముంబై లోకల్ రైళ్లలో గ్రే కోచ్‌లపై ఎరుపు గీతలు ఫస్ట్ క్లాస్ బోగీలను సూచిస్తాయి. ఈ రంగుల కోడింగ్ వల్ల ప్రయాణికులకు తమకు కావాల్సిన కంపార్ట్‌మెంట్లను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది.

Allu Arjun :సైమా వేదికపై మెరిసిన అల్లు అర్జున్..వరుసగా మూడోసారి

Exit mobile version