Adivani:అంతరించిపోతున్న భాషలకు ‘ఆదివాణి’కి సంబంధం ఏంటి?

Adivani: భారతదేశంలో ఉన్న వేలాది భాషల్లో చాలావరకు సరైన గుర్తింపు లేక, డాక్యుమెంటేషన్ లోపించి, మరుగున పడిపోతున్నాయి.

Adivani

ఒకవైపు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుంటే… మరోవైపు మన దేశంలో కొన్ని భాషలు మౌనంగా అంతరించిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే ‘ఆది వాణి’. ఇది ఒక సాధారణ యాప్ కాదు, ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేసే ఒక భాషా అనువాద సాధనం. ఈ చిన్న యాప్ ఇప్పుడు గిరిజన ప్రజలకు, బయట ప్రపంచానికి మధ్య ఒక పెద్ద వారధిగా నిలుస్తోంది.

భారతదేశంలో ఉన్న వేలాది భాషల్లో చాలావరకు సరైన గుర్తింపు లేక, డాక్యుమెంటేషన్ లోపించి, మరుగున పడిపోతున్నాయి.దాదాపు 461 షెడ్యూల్డ్ తెగల భాషలు, 71 గిరిజన మాతృభాషలు ఉండగా, వాటిలో 81 భాషలు ప్రమాదకర స్థితిలో, 42 భాషలు పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ సైలెంట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని, మన సంస్కృతిని కాపాడటానికి ‘ఆది వాణి’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక అనువాద యాప్ కాదు, అంతరించిపోతున్న భాషలకు, సంస్కృతులకు డిజిటల్ వేదిక కల్పించే ఒక గొప్ప ప్రయత్నం.

అసలు ఆది వాణి’ (Adivani) అంటే ఏంటి? ఎందుకు అంత ముఖ్యం అంటే..గిరిజన ప్రైడ్ ఇయర్ కింద అభివృద్ధి చేయబడిన ఆది వాణి,(Adivani) భారతదేశంలో మొట్టమొదటి AI-ఆధారిత గిరిజన భాషా అనువాదకుడు. ఇది ఒక మొబైల్ యాప్‌గా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.. వెబ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. అంతరించిపోతున్న భాషలను కాపాడటమే కాకుండా, గిరిజన, గిరిజనేతర సమాజాల మధ్య కమ్యూనికేషన్ అంతరాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.

ఐఐటీ ఢిల్లీ నాయకత్వంలో, బిట్స్ పిలానీ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ నయా రాయ్‌పూర్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు వివిధ రాష్ట్రాల గిరిజన పరిశోధనా సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

ఈ AI-ఆధారిత ప్రాజెక్ట్ గిరిజన ప్రజలకు, అలాగే బయట ప్రపంచానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ఇది గిరిజన భాషలను డిజిటల్‌గా రికార్డు చేసి, డాక్యుమెంట్ చేస్తుంది. దీని ద్వారా ఈ భాషలు భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంటాయి.

Food: ఈ ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచివి కావట..

adivani

హిందీ/ఇంగ్లీష్ నుంచి గిరిజన భాషలకు , తిరిగి రియల్-టైమ్ అనువాదం చేస్తుంది. దీనివల్ల కమ్యూనికేషన్ చాలా సులభం అవుతుంది. గిరిజన విద్యార్థులు తమ మాతృభాషలో ఇంటరాక్టివ్‌గా చదువుకోవడానికి ఇది సహాయపడుతుంది.

సాంస్కృతిక వారసత్వంగా నిలుస్తుంది. జానపద కథలు, పాటలు, మౌఖిక సంప్రదాయాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసి, వాటిని రక్షిస్తుంది. ఆరోగ్య సందేశాలు, ప్రభుత్వ పథకాల సమాచారం గిరిజన భాషల్లో అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి..ఈ టెక్నాలజీ గిరిజన ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి ఒక కీలక సాధనంగా నిలుస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో సంతాలి, భిలి, ముండారి, గోండి వంటి భాషలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో కుయ్, గారో వంటి మరిన్ని భాషలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆది వాణి’ (Adivani) అనేది కేవలం ఒక యాప్ కాదు, ఇది గిరిజన భాషలకు, సంస్కృతికి కొత్త జీవం పోసి, వాటిని డిజిటల్ యుగంలో నిలబెట్టే ఒక గొప్ప ప్రయత్నం. ఈ టెక్నాలజీ గిరిజన ప్రజలకు ఒక వరంలా మారి, వారిని సమాజంలో మరింతగా కలుపుతుందని చెప్పొచ్చు.

Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది..

Exit mobile version