Solar eclipse
ప్రకృతిలో సంభవించే అద్భుతమైన ఖగోళ సంఘటనలలో సూర్యగ్రహణం ఒకటి. ఈ సంవత్సరం, పితృపక్షం ఆఖరి రోజున, అంటే భాద్రపద అమావాస్య రోజున, సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో, కన్యా రాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది, అమావాస్య తిథి అవుతుంది.
ఈ సూర్యగ్రహణం (solar eclipse)భారతదేశంలో కనిపించదు. ఈ దృశ్యం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి , అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనపడుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11:00 గంటలకు మొదలై, అర్ధరాత్రి 2:03 నిమిషాలకు ముగుస్తుంది.కనుక సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు.
ఈ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో సంచరిస్తుంటారు. కుజుడు తులా రాశిలో, రాహువు కుంభ రాశిలో, గురువు మకర రాశిలో, శని మీన రాశిలో ఉంటారు. శుక్రుడు , కేతువు సింహ రాశిలో సంచరిస్తారు. కన్యా రాశిలో, ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ గ్రహణం రోజున ప్రత్యేక ఫలితాలు పొందే అవకాశం ఉంది.
ఈ సూర్యగ్రహణం (solar eclipse)భారతదేశంలో కనపడదు కాబట్టి, దాని సూతక కాలం ఇక్కడ వర్తించదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు, లేదా నివారణలు పాటించాల్సిన అవసరం లేదు. అయినా కూడా భవిష్యత్తులో ఏదైనా గ్రహణం ఏర్పడితే, అది పూర్తయిన తర్వాత కొత్త పనులను ప్రారంభించడం శుభప్రదమని చెబుతారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించబడుతుంది.
2027 ఆగస్టు 2న ఒక భారీ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద గ్రహణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత, 2114లో మాత్రమే ఇలాంటి భారీ గ్రహణం మళ్లీ కనిపిస్తుంది. ఈ ఖగోళ దృశ్యాలు ప్రకృతిలో జరిగే అద్భుతమైన సంఘటనలుగా మిగిలిపోతాయి.