Job skills
భారత ఎంప్లాయబిలిటీ స్కిల్స్ రిపోర్ట్-2026 నివేదిక ప్రకారం, భారతదేశంలో ఉద్యోగ అర్హత కలిగిన యువత శాతం గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి AICTE, CII మద్దతుతో వీబాక్స్ నిర్వహించిన గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ (GET) ఆధారంగా ఈ వివరాలు రూపొందించబడ్డాయి. దేశంలోని మొత్తం యువతలో 56.35% మంది ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు(Job skills) కలిగి ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. ఇది 2022తో పోలిస్తే సుమారు 2% పెరుగుదల కావడం సానుకూల అంశం.
ఉద్యోగ నైపుణ్యాల(Job skills) విషయంలో రాష్ట్రాల పనితీరులో ఉత్తర్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది, ఇక్కడ 78.64% యువత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. దీని తర్వాత మహారాష్ట్ర (75.42%), కర్ణాటక (73.85%), కేరళ (72.16%), ఢిల్లీ (71.25%) స్థానాల్లో ఉన్నాయి. ఉద్యోగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాలుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ నిలిచాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరాలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణే, ముంబయి, చెన్నై ఉన్నాయి.
నివేదికలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, మహిళల ఉద్యోగ నైపుణ్యాలు(Job skills) పురుషుల కంటే మెరుగ్గా ఉండటం. మహిళల ఉద్యోగర్హత రేటు 54%గా నమోదు కాగా, పురుషులది 51.5%గా ఉంది. హైబ్రిడ్ పని విధానం పెరుగుదల మరియు డిజిటల్ నైపుణ్యాలలో మహిళలు ముందుండటం ఈ సానుకూల మార్పుకు ప్రధాన కారణాలుగా పేర్కొనబడింది.
మహిళలు ఎక్కువ ఉద్యోగ నైపుణ్యాలు Job skills)కలిగి ఉన్న రాష్ట్రాలలో రాజస్థాన్, కేరళతో పాటు తెలంగాణ (3వ స్థానం),. ఆంధ్రప్రదేశ్ (4వ స్థానం) ఉండటం దక్షిణ భారతదేశంలో మహిళా సాధికారతను సూచిస్తోంది. ముఖ్యంగా, బీమా, విద్య, ఆరోగ్య రంగాల్లో ఉత్తర్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలోని టియర్-2, టియర్-3 ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
వృత్తి విద్యా కోర్సుల విషయానికి వస్తే, MBA గ్రాడ్యుయేట్స్ (72.76%), B.Tech గ్రాడ్యుయేట్స్ (70.15%) అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారు. అయితే, 2025తో పోలిస్తే 2026లో MBA గ్రాడ్యుయేట్స్‌లో 5% తగ్గుదల, B.Tech గ్రాడ్యుయేట్స్‌లో 1.35% స్వల్ప తగ్గుదల కనిపించడం ఉన్నత విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
వివిధ నైపుణ్యాల విభాగాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, ఇంగ్లీష్ ప్రావీణ్యం కలిగిన యువత శాతంలో మహారాష్ట్ర (68.23%) ముందంజలో ఉంది. పంజాబ్ , ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. క్లిష్ట ఆలోచనా నైపుణ్యాల్లో కూడా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ ముందున్నాయి. వయసు ప్రాతిపదికన చూస్తే, 22–25 ఏళ్ల వయస్సుల వారు (75.7%) అత్యధిక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ప్రధానంగా నిలుస్తున్నారు.
ఉద్యోగ నియామక ప్రక్రియల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. IT రంగంలో 70% సంస్థలు, BFSI రంగంలో 50% సంస్థలు AIను పూర్తిగా లేదా పాక్షికంగా వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇది రాబోయే కాలంలో ఉద్యోగార్థులు కేవలం సాంప్రదాయ నైపుణ్యాలతో పాటు AIతో కలిసి పనిచేయగలిగే డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తుంది.
పురుషులు గ్రాఫిక్ డిజైన్ (83.11%), ఇంజినీరింగ్ డిజైన్ (64.67%) వంటి రంగాలపై ఆసక్తి చూపగా, మహిళలు లీగల్ రంగం (96.4%), హెల్త్‌కేర్ (85.95%) వంటి రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తేలింది.
