Bihar Exit Polls: బిహార్ లో గెలుపు ఎవరిదంటే ? ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

Bihar Exit Polls: పీపుల్స్ పల్స్ , దైనిక్ భాస్కర్ , పీపుల్స్ ఇన్ సైట్ , మ్యాట్రిజ్, పీ మార్క్ వంటి ప్రధాన సర్వేలన్నీ కూడా ఎన్టీఏకే మొగ్గు చూపాయి.

Bihar Exit Polls

దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసింది. రికార్డ్ స్థాయిలో 67 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే సారి బిహార్ ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు ఎన్డీఏ, ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో మహాఘట్‌బంధన్‌ కూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి. పోటీపోటీగా హామీల వర్షం కురిపించాయి. వారి అంచనాలకు తగ్గట్టే పోలింగ్ శాతం కూడా బాగా పెరిగింది.

మరి పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి నష్టం చేయబోతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ కొనసాగిస్తూ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్టీఏకే పట్టం కట్టాయి. మొత్తం 243 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి సగటున 133 నుంచి 160 సీట్ల వరకూ సాధిస్తుందని తెలుస్తోంది.

తేజస్వీ యాదవ్ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ కూటమి 100 లోపు సీట్లకే పరిమితం కానున్నట్టు ఎగ్జిట్ పోల్స్(Bihar Exit Polls) అంచనా వేసాయి. ఇక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపదని ఎగ్జిట్ పోల్స్(Bihar Exit Polls) తేల్చేశాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 2 నుంచి 6 సీట్లు రావొచ్చని అంచనా వేశాయి.

Bihar Exit Polls

పీపుల్స్ పల్స్ , దైనిక్ భాస్కర్ , పీపుల్స్ ఇన్ సైట్ , మ్యాట్రిజ్, పీ మార్క్ వంటి ప్రధాన సర్వేలన్నీ కూడా ఎన్టీఏకే మొగ్గు చూపాయి.బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహింతాపు. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 6న 65.08 శాతం నమోదవగా.. ఇవాళ 67 శాతం కంటే నమోదైనట్టు సమాచారం. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశముండడంతో పోలింగ్ శాతం 70 శాతానికి చేరే అవకాశముంది భావిస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్(Bihar Exit Polls) ఫలితాలు ఇవే :

పీపుల్స్ పల్స్ : ఎన్డీఏ 133-159 సీట్లు, మహాగఠ్ బంధన్ 75-101 సీట్లు
ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ః 0-5 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు

దైనిక్ భాస్కర్: ఎన్డీఏ 145-160 సీట్లు, మహాగఠ్ బంధన్ 73-91 సీట్లు,
ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ : 0-3 సీట్లు, ఇతరులు 5-7 సీట్లు

పీపుల్స్ ఇన్ సైట్: ఎన్డీఏ 133-148, విపక్షాలు 87-102 సీట్లు, ఇతరులు 3-6 సీట్లు
జన్ సురాజ్ పార్టీ :0-2 సీట్లు

మ్యాట్రిజ్: ఎన్డీఏ 147-167 విపక్షాలు 70-90 సీట్లు, ఇతరులు 2-8 సీట్లు
జన్ సురాజ్ పార్టీ: 0-2 సీట్లు

పీ-మార్క్ : ఎన్డీఏ 142-162 విపక్షాలు 80-98 సీట్లు, ఇతరులు 0-3 సీట్లు
జన్ సురాజ్ పార్టీ : 1-4 సీట్లు

By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆ పార్టీ గెలుస్తుందా? ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

Exit mobile version