Election 2025: కాంగ్రెస్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ? గెలుపు డౌటే అంటున్న విశ్లేషకులు

Election 2025: కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు విషయంలో ఎంత టెన్షన్ తో ఉందో అర్ధం అవుతుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఉన్న రౌడీ బ్యాగ్రౌండ్.

Election 2025

అధికారంలో ఉన్న పార్టీకి…. ఉప ఎన్నిక(Election 2025)ల్లో గెలవడం నల్లేరు మీద నడక లాంటిది. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అప్పట్లో బి .ఆర్ .ఎస్ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్కు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇజ్జత్ కా సవాల్ లాంటిది. ఒక రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇది రెఫరెండమే. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Election 2025) ఒక చిన్న పరీక్ష.

అందుకే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి ముఖ్యమంత్రి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు.ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ముఖ్యమంత్రి ఇన్ని రోడ్ షోలు చేయడం, ఇన్ని సభలు పెట్టడం ఎన్నడు జరగలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు విషయంలో ఎంత టెన్షన్ తో ఉందో అర్ధం అవుతుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఉన్న రౌడీ బ్యాగ్రౌండ్. ఇప్పటికీ పబ్లిక్ లో నవీన్ యాదవ్, ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ బ్యాక్ గ్రౌండ్ గురించే చర్చ జరుగుతుంది.

election-2025

రౌడీలకు ఓటు వేయడం అవసరమా అంటూ ప్రత్యర్థి పార్టీలు గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో కొచ్చి.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించకపోతే పథకాలు ఆగిపోతాయి అంటూ ప్రకటించడం కూడా ఆ పార్టీకి నెగిటివ్ అయ్యేటట్లు ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బస్తీలలో రేవంత్ మాట కొంత నెగిటివ్ తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. జూబ్లీహిల్స్ లో లక్షకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. అజారుద్దీన్ ను మంత్రిని చేసాం కనుక…. ముస్లిం ఓట్లన్నీ కచ్చితంగా కాంగ్రెస్‌కు పడిపోతాయని హై కమాండ్ చాలా ధీమాగా ఉంది. కానీ హఠాత్తుగా అజారుద్దీన్ ను తెరమీదకి తీసుకొచ్చి…. ఓట్లు అడిగితే ముస్లింలంతా డైరెక్ట్ గా కాంగ్రెస్ కు వేసేస్తారనుకోవడం అపోహే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి హైదరాబాదులో హైడ్రా కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా కిందిస్థాయి ప్రజలు చాలామంది హైడ్రా బాధితులే. హైదరాబాదులో హైడ్రా వల్ల వచ్చిన నెగిటివ్ టాక్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికల్లో(Election 2025) బిజెపి ఇప్పటికే చేతులెత్తేసింది. అసలు కమలం పార్టీ అభ్యర్థి ఏ రకం గాను పోటీలో లేరు.

పోటీ మొత్తం బి ఆర్ ఎస్ , కాంగ్రెస్ మధ్య ఉంది. బి ఆర్ ఎస్ పూర్తిగా డోర్ టు డోర్ ప్రచారాన్ని నమ్ముకుంది. సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అయినా కాకపోయినా, రేవంత్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత…. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని బి.ఆర్ ఆశ. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా నిశ్శబ్దంగా అండర్ కరెంటు ఉందని చాలామంది చెప్తున్నారు.నోటిఫికేషన్ వచ్చే రోజు జూబ్లీహిల్స్ ఉపయోగ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం అన్నవాళ్లంతా…. ఇప్పుడు కాంగ్రెస్ డౌటే అని మాట్లాడుతున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version