Elections: స్థానిక సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్..  రిజర్వేషన్లపై జీవో విడుదల

Elections: తాజాగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేసింది. సుప్రీకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది.

Elections

గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల(Elections) నిర్వహణకు ఇప్పుడు సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల్లో(Elections)నూ విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలో లోకల్ పోల్స్ నిర్వహణకు వేగంగా అడుగులు వేస్తోంది.

తాజాగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేసింది. సుప్రీకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేయడంతో పాటు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్దతిలో అమలు చేయాలని స్పష్టం చేసింది.

రిజర్వేషన్ కేటాయించేందుకు 2024 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే సర్పంచ్ రిజర్వేషన్‌కు సంబంధించి 2011 జనగణనతోపాటు ఎస్ఈఈపీసీ డేటా వినియోగించాలని తెలిపింది. 100శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది.

Elections

గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు లేదా గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని, 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. ఎంపీడీవో ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్ల నిర్ణయం, ఆర్డీవో ఆధ్వర్యంలో సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం జరగాలని ఆదేశించింది.

రిజర్వేషన్లను ఖరారు చేసే క్రమంలో ముందు ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని పేర్కొంది. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని జీవోలో స్పష్టంగా పేర్కొంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని కేటగిరీల్లో మహిళా రిజర్వేషన్లను ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలని పేర్కొంది. వార్డుల సంఖ్య తక్కువగా ఉంటే మొదట మహిళలు, ఆ తర్వాత లాటరీ విధానంలో కేటాయించాలని స్పష్టం చేసింది.

ఈ జీవోకు సంబంధించి అన్ని అంశాల అమలును జిల్లా కలెక్టర్లు, సంబంధించి ఎన్నికల అధికారులు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదేనని తేల్చి చెప్పింది. కాగా నవంబర్ 24న గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇవ్వనుండగా.. తర్వాత కేబినెట్ మీటింగ్ లో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Byju’s Ravindran: బైజూస్ రవీంద్రన్‌కు భారీ దెబ్బ.. అమెరికా కోర్టు సంచలన తీర్పు

Exit mobile version