Mallareddy: ఏ పార్టీ వైపు చూడను..మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Mallareddy: ఇక ఏ పార్టీ వైపు చూడటం లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని మల్లారెడ్డి అన్నారు.

Mallareddy

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను ఇక ఏ పార్టీ వైపు చూడటం లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని ఆయన అన్నారు. తన వయసు 73 సంవత్సరాలని, ఇప్పటికే ఎంపీగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. ఇంకా మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతానని, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

తన రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చిందని చెప్పిన మల్లారెడ్డి(Mallareddy), ప్రజలకు సేవ చేయాలనే తన ఆకాంక్షను మాత్రం వదులుకోలేదు. “ప్రజలకు మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది” అని చెబుతూ, విద్య, వైద్య రంగాలపై తన దృష్టి ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న మల్లారెడ్డి విద్యాసంస్థలు దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజినీర్లు, మేనేజ్‌మెంట్‌లను తయారు చేస్తున్నాయని ఆయన గర్వంగా చెప్పారు. తన ఈ విజయానికి దేవుడికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Mallareddy

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా డీమ్డ్ యూనివర్సిటీలు స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని మల్లారెడ్డి(Mallareddy) ప్రకటించారు. ఇప్పటికే నోయిడాలో ఒక యూనివర్సిటీకి సంబంధించిన పనులు పూర్తయ్యాయని, లక్నోలో 50 ఎకరాల్లో ఒక పెద్ద ‘డిజిటల్ హెల్త్ సిటీ’ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉత్తర భారతదేశానికే కాకుండా, బీహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వైజాగ్, కర్నూల్ వంటి ప్రధాన నగరాల్లోనూ యూనివర్సిటీలు స్థాపించి, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ పనులన్నీ ప్రజలకు మంచి సేవ చేసేందుకే అని ఆయన వెల్లడించారు.

 

Exit mobile version