Prashant Kishor: వచ్చే 150 లేకుంటే 10..  పీకే కామెంట్స్ వైరల్

Prashant Kishor: ప్రస్తుతం ప్రజలు జన్ సూరాజ్‌ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఓటు వేయడానికి వారికి నమ్మకం అవసరమనీ, వారు నమ్మితే తన పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందన్నారు.

Prashant Kishor

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అందరి చూపు బిహార్ వైపే ఉంది. త్వరలో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార , ప్రతిపక్ష పార్టీలు ఎవరి వ్యూహంలో వారు బిజీగా ఉన్నాయి. పోటాపోటీగా హామీలు ప్రకటిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సారి బిహార్ ఎన్నికలు ఆసక్తిగా మారడానికి మరో కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కొత్త పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయడమే.

పలు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు అధికారంలోకి రావడానికి కృషి చేసిన పీకే ఇప్పుడు తానే స్వయంగా పొలిటికల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హామీలు కూడా ప్రకటించిన పీకే ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో తన విజయావకాశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భిన్నమైన అంచనాతో అక్కడి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మీ పార్టీ ఎన్ని సీట్లు గెలవొచ్చన్న ప్రశ్నకు జవాబిస్తూ నాయకులు ఎప్పుడూ విజయం సాధిస్తామనే చెబుతుంటారని, తాను అన్ని కోణాల్లో ఆలోచిస్తానని వ్యాఖ్యానించారు.

Prashant Kishor

ప్రస్తుతం ప్రజలు జన్ సూరాజ్‌ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఓటు వేయడానికి వారికి నమ్మకం అవసరమనీ, వారు నమ్మితే తన పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందన్నారు. అప్పుడు ఫలితం 150 సీట్ల కంటే ఎక్కువే ఉంటుందన్నారు. లేకపోతే 10 సీట్ల కంటే తక్కువకే పరిమితం కావచ్చని అంచనా వేశారు. దీంతో ఎన్నికలకు ముందే పీకేకు తన ఫ్యూచర్ క్లారిటీ వచ్చేసిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ జన్ సురాజ్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారిపోవచ్చని అభిప్రాయపడ్డారు.
కేసుల కోసమే…డబ్బు కోసమో ఆశపడి పార్టీలు మారిపోవచ్చని..తాను వారిని అడ్డుకోలేంటున్నారు. ఎన్నికల్లో జనసురాజ్ పార్టీని అసలు పోటీగా చూడటం లేదని వస్తున్న విశ్లేషణలను ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) నేరుగానే అంగీకరిస్తున్నారు. ప్రజల తీర్పు అంత తేలిగ్గా అంచనా వేయలేమంటూ పీకే మాట్లాడడం కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.,

బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఏ కూటమిలోనూ చేరలేదు. ఖచ్చితంగా తాను కింగ్ మేకర్ అవుతానన్న నమ్మకంతో ఉన్నప్పటకీ మధ్యమధ్యలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇదంతా వ్యూహంలో భాగమా లేక ఓటమిని ముందే పసిగట్టారా అన్నది తెలియడం లేదు. అయితే ఈ ఎన్నికల్లో పీకే పోటీ చేయడం లేదు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. తన పార్టీ ఘోరపరాభవాన్ని ముందే ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version