Kavitha:నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్..ఆ పార్టీలోకి మాత్రం వెళ్లను

Kavitha: ఉన్న పార్టీల్లో ఎందులోనైనా కవిత ( Kavitha)చేరతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kavitha

తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కవిత హాట్ టాపిక్.. కొంతకాలంగా తన సొంత పార్టీతోనే ఎదురుతిరుగుతూ వార్తల్లో నిలిచారు. పార్టీని కొందరు నాశనం చేస్తున్నారంటూ హరీశ్ రావు, సంతోష్ ను ఉద్దేశిస్తూ కేసీఆర్ కు లేఖలు రాశారు. ఆమె ధిక్కార స్వరం పెరిగిపోవడంతో అందరూ ఊహించినట్టుగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనను సస్పెండ్ చేసిన మరుక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ సూచనలు కూడా చేశారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తుందని దాదాపు రెండు నెలల క్రితమే వచ్చిన వార్తలు నిజమవగా.. ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Home Bound : ఆస్కార్ బరిలో జాన్వీకపూర్ మూవీ..హోమ్ బౌండ్ నామినేట్

ఉన్న పార్టీల్లో ఎందులోనైనా కవిత ( Kavitha)చేరతారా లేక కొత్త పార్టీ పెడతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు ఫ్రీ బర్డ్ అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉందంటూ చెప్పుకొచ్చారు. అన్ని దారులూ తెరిచే ఉన్నాయంటూ పరోక్షంగా ఇతర పార్టీల గురించి మాట్లాడారు. చాలా మంది సీనియర్ నేతలు వచ్చి కలుస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు కూడా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

Kavitha

నిజానికి బీఆర్ఎస్ పార్టీలు టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు కవిత( Kavitha) పార్టీ పెడితే మంచి ప్రత్యామ్నాయమే అవుతుంది. కానీ కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని మాత్రం కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదన్నారు. తాను ఎవరినీ అప్రోచ్ కాలేదంటూ చెప్పిన కవిత, సీఎం రేవంత్ తనును ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. బహుశా ఆయనే కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్న రేవంత్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ, హరీశ్ రావు, సంతోష్ సోషల్ మీడియా వర్గాలు తనపై చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని కవిత( Kavitha) చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విషయంలో తప్ప హరీశ్ రావుపై తనకు కోపం లేదని కవిత అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా స్పీకర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీదని, కావాలంటే రాజీనామా లేఖను మరోసారి పంపిస్తామన్న కవిత ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే స్వాగతించాలని అభిప్రాయపడ్డారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version