Kavitha: బీఆర్ఎస్‌లో అంతర్గత యుద్ధం..ఆ ఇద్దరినీ టార్గెట్ చేసిన కవిత

Kavitha: కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు తీవ్రస్థాయిలో ఉందని స్పష్టం చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Kavitha

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన అధికార పక్షం , ప్రతిపక్షం మధ్య ఉన్న సాధారణ పోరు కాదని, బీఆర్ఎస్‌లోని అంతర్గత యుద్ధమని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును బహిరంగంగా బయటపెట్టాయి. ఆమె ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ కుమార్ వంటి కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి లాగడం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపును సృష్టించింది.

కవిత(Kavitha) తన వ్యాఖ్యలలో తన తండ్రి కేసీఆర్ మీద ప్రేమను బయటపెడుతూనే..ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడం. .ఆరోపణ మాత్రమే కాదు, ఒక రాజకీయ వ్యూహం అంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె ఒకేసారి ఇద్దరు కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు.

Kavitha

రెండో టర్మ్‌లో ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ నుంచి హరీష్ రావును తొలగించడం వెనుక అవినీతి ఆరోపణలే కారణమని కవిత (Kavitha) చెప్పారు. ఇది పార్టీలో హరీష్ రావుకు ఉన్న పట్టును బలహీనపరచడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు.అంతేకాదు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా పేరున్న జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై ఆరోపణలు చేయడం ద్వారా, పార్టీలో తన పట్టును పెంచుకోవడానికి కవిత ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Gold: సామాన్యుడికి కలగా మిగులుతున్న పసిడి..ఈరోజు ధర ఎంత?

ఈ వివాదంలో కవిత సీఎం రేవంత్ రెడ్డిని కూడా లాగడం ఆసక్తికరంగా మారింది. హరీష్-సంతోష్ వెనక రేవంత్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో తమ ప్రత్యర్థులను పరోక్షంగా లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కూటములకు అవకాశం ఇస్తున్నాయి. రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా భావించే ఈ ముగ్గురూ అవినీతి విషయంలో ఒకరికొకరు సహకరించుకున్నారనే కవిత ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Kavitha

అయితే కవిత (Kavitha) వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు తీవ్రస్థాయిలో ఉందని స్పష్టం చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చనే సంకేతాలు బయటకు పంపిస్తున్నాయి.అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ పార్టీ నాయకులే అవినీతికి పాల్పడితే, కేసీఆర్ దానిని ఎందుకు నియంత్రించలేదని ప్రజల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి.

పార్టీ ఓటమి తర్వాత, కీలక వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసి ప్రజాధారణ తగ్గుతుంది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారొచ్చు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాజకీయ వ్యూహాలు, పార్టీల వైఖరి,ప్రభుత్వ స్పందనలలో కీలక మార్పులకు దారితీయొచ్చు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది..

Exit mobile version