Karnataka CM: సిద్ధరామయ్య X డీకే శివకుమార్..  డిసెంబర్ 1న తేల్చనున్న అధిష్టానం

Karnataka CM: వచ్చే రెండున్నరేళ్లు డీకే శివకుమార్ కే సీఎం బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ ను కోరుతున్నారు.

Karnataka CM

కర్ణాటక సీఎం (Karnataka CM)పదవి పంచాయతీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వివాదం సద్దుమణిగిపోయిందని అంతా భావించారు. మరో రెండున్నరేళ్లు కూడా సిద్ధరామయ్యే సీఎం(Karnataka CM)గా ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్య పరిణామాలతో ఇప్పుడు రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో మిగిలిన రెండున్నరేళ్ళు తమ నాయకుడు డీకే శివకుమార్ కే ఇవ్వాలంటూ అతని మద్ధతుదారులు గట్టిగా పట్టుబడుతున్నారు.

దీంతో ఈ పంచాయతీతో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక సీఎం వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైంది. పార్టీలో ఎలాంటి అస్థిరత రాకుండా ఉండే క్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కర్ణాటక సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య(Karnataka CM) , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి పిలిచి మాట్లాడించాలని భావిస్తున్నారు. ఈ అంతర్గత పోరుపై ఇరు వర్గాల్లోని కొందరు నేతలు బహిరంగ ప్రకటనలు చేయడంపైనా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇలా బహిరంగ ప్రకటనలు, విమర్శలు గుప్పించుకుంటే విపక్షాల చేతికి అస్త్రాలను ఇచ్చినట్టు అవుతుందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Karnataka CM

ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను కనీసం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. ఇదే హడావుడిలో కర్ణాటక కేబినెట్ విస్తరణకు సిద్ధరామయ్య సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెరవెనుక జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, మరో రెండున్నరేళ్లు డీకే శివకుమార్ సీఎం (Karnataka CM)పీఠంపై కొనసాగేలా ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

దీనిని గుర్తు చేస్తూ డీకే శివకుమార్ మద్ధతుదారులు హడావుడి చేస్తున్నారు. వచ్చే రెండున్నరేళ్లు డీకే శివకుమార్ కే సీఎం బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ ను కోరుతున్నారు. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రెండు వైపుల నుంచీ తమ మద్ధతుదారుల నుంచే తమ వాదన వినిపిస్తున్నారు.

దీంతో ఈ అనిశ్చితికి త్వరగా తెరదించకపోతే పార్టీకి నష్టం జరగడం ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సిద్ధరామయ్యకే ఎక్కువ ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటకీ.. డీకే శివకుమార్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఈ ఇష్యూని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందనేది చూడాలి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version