CM Chandrababu
ఏపీ సీఎం చంద్రబాబుకు దూరదృష్టి ఎక్కువే. ఈ విషయాన్ని తన ఆలోచనలలోనూ,పనులలోనూ చూపిస్తూనే ఉంటారు. దీనిలో భాగంగానేచిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారి తీస్తుందన్న విషయాన్ని బాగా గమనించిన చంద్రబాబు నాయుడు ముందే అప్రమత్తంగా అడుగులు వేస్తున్నారు. శాసనసభ సభ్యులకు, మంత్రులకు ముందుగానే క్లియర్‌గా మార్గదర్శకాలు ఇస్తున్నారు.
గతంలో రాజకీయ నేతలు ఎవరితోనైనా ఫోటోలు దిగడం వల్ల పార్టీల పరువు మంటగలిసిన ఉదాహరణలు కోకొల్లలు. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా తగిన హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
రీసెంట్ గా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు(CM Chandrababu) వ్యక్తిగతంగా మంత్రులను హెచ్చరించారు. బహిరంగ కార్యక్రమాల్లో ఎవరితోనైనా ఫోటోలు దిగేముందు వారెవరో తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పార్టీలోకి సంబంధం లేని వారిని కలవడం, ఫోటోలు దిగడం వల్ల ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండాలని సూచించారు. దీంతో మంత్రి ఫరూఖ్ తన వద్దకు టీడీపీ వారు కాకపోతే రానివ్వనన్న చెప్పగా..మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అదే చెప్పారు.
మరోవైపు ప్రత్యక్ష ప్రజాభిముఖ పాలనలో చంద్రబాబు (CM Chandrababu)ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఆగస్ట్ 7న జరగబోయే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతన్న పథకాన్ని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి చేనేత కుటుంబాలకు నిజంగా ఉపయోగపడే ప్రకటన రానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ముందుగానే తేదీలు పరిశీలనలో పెట్టారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరపాలని, లేకపోతే సెప్టెంబర్ తొలి వారంలో జరపాలని మంత్రి కేశవ్ ముందస్తు ప్రణాళిక చేపట్టారు.
మొత్తానికి… సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటినుంచే రాజకీయ పరిపక్వతతో, పరిపాలనా ప్రగతితో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రతిష్టను కాపాడుతూ, ప్రజల అభివృద్ధికి బాట వేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.