Rahul Gandhi:సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు..  రాహుల్ గాంధీపై విమర్శలు

Rahul Gandhi:రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఒక్కోసారి నోరు జారుతుంటారు..

Rahul Gandhi

రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకునే క్రమంలో ఒక్కోసారి నోరు జారుతుంటారు.. మరికొన్ని సార్లు వ్యూహాత్మకంగానే తమపై ఫోకస్ ఉండేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. దీనికి విమర్శలు వస్తాయని తెలిసినా దానికి సిద్ధపడే కామెంట్స్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో అయితే వీటి గురించే చెప్పాల్సిన పనే లేదు.

ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసేందుకు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శల పాలయ్యారు. ప్రస్తుతం బిహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది చేతుల్లోనే మన సైన్యం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే దేశంలోనే కార్పొరేట్,బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో కూడా 10 శాతం మందికే అవకాశాలు వస్తున్నాయంటూ విమర్శించారు. అగ్రకులాలను ఉద్దేశించే రాహుల్ ఈ విధంగా మాట్లాడారని తెలుస్తోంది. దేశంలో మిగిలిన 90 శాతం మంది ప్రజలు.వ్యవస్థలో ఎక్కడా కనిపించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi

ఇదే క్రమంలో కులగణన ఎంత అవసరమో ఈ సభలో వివరించే ప్రయత్నం చేశారు. కులగణన లేకుంటే రాజ్యాంగాన్ని కాపాడడం సాధ్యం కాదన్నారు. దేశంలో వెనుకబడి కులాలకు చెందిన దళితులు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీల కచ్చితమైన సంఖ్య వెల్లడించాల్సిందేనని డిమాండ్ చేశారు. దేశంలో 90 శాతం మందికి సరైన హక్కులు లేకుంటే రాజ్యాంగపరమైన దేశంగా గుర్తింపు ఉండడంలో అర్థం లేదంటూ రాహుల్(Rahul Gandhi) వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా సామాజిక న్యాయ పోరాటంపైనే దృష్టి పెట్టిన రాహుల్ భారత సైన్యం గురించి చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి పార్టీలు ఫైర్ అవుతున్నాయి.

నిజానికి భారత ఆర్మీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో సైన్యంపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కోర్టులు ఆయనను మందలించాయి. మాట్లాడేటప్పుడు కాస్త సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేశాయి. 2022 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు దగ్గర భారత్-చైనా సైనిక ఘర్షణపై రాహుల్ గాంధీ వివాదాస్పదంగా మాట్లాడారు. అప్పుడు పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానాలు రాహుల్ కు నోటీసులిచ్చి మందలించాయి. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version