Rahul Gandhi : ఫుల్ యాక్షన్ మోడ్‌లో రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఒకప్పుడు రాహుల్ గాంధీపై సీరియస్ పొలిటికల్ లీడర్ కాదనే ట్యాగ్ బలంగా ఉండేది.

Rahul Gandhi : ఒకప్పుడు రాహుల్ గాంధీపై సీరియస్ పొలిటికల్ లీడర్ కాదనే ట్యాగ్ బలంగా ఉండేది. ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీలోనూ బాహాటంగానే విమర్శించేవారు. కానీ, కొన్ని నెలలుగా ఆయనలో వచ్చిన మెగా ఛేంజ్, ఆ డెడికేషన్ చూశాక… ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు షాక్ అవుతున్నారు.  పూర్తి యాక్షన్ మోడ్‌లో ఉన్న రాహుల్‌ను చూసి “రియల్ పొలిటికల్ లీడర్ అంటే రాహులే” అని ఓపెన్‌గా ఒప్పుకుంటున్నారు. ఆయన కమిట్‌మెంట్, కన్సిస్టెన్సీ ఆ పాత ట్యాగ్‌ను పూర్తిగా చెరిపేసి, రాహుల్‌ను ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా నిలబెట్టిందంటున్నారు.

Rahul Gandhi

ఇంతకుముందు కేవలం ఢిల్లీ(Delhi), ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో మాత్రమే కనిపించే రాహుల్, ఇప్పుడు బిహార్(Bihar), గుజరాత్ (Gujarath) వంటి రాష్ట్రాల్లో నేరుగా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. పార్టీ జిల్లా యూనిట్లను తిరిగి బలోపేతం చేయడం, రాష్ట్ర విభాగాల పనితీరును సమీక్షించడం వంటి కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ నిండిపోయింది. కేవలం పెద్ద పెద్ద ర్యాలీలకు పరిమితం కాకుండా, రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూడా రాహుల్‌నే అనుసరించేంతగా ఎదిగేరు.

గతంలో తనపై వచ్చిన ‘నాన్-సీరియస్’ విమర్శలకు రాహుల్ గత ఏడాది ఏప్రిల్‌లో ధైర్యంగా సమాధానం ఇచ్చారు. “భూసేకరణ బిల్లు, MNREGA వంటి వాటి గురించి మాట్లాడితే అది సీరియస్ కాదా? పెద్ద జనాభా గురించి మాట్లాడితే సీరియస్ కాదా? మీ చేతిలో లౌడ్‌స్పీకర్ లేకపోతే, మీరు చెప్పేది ఏదైనా సీరియస్కాదా? అని ప్రశ్నించి, తాను సిద్ధాంతపరంగా ఎంత నిబద్ధుడనో క్లారిటీ ఇచ్చారు.

 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాహుల్ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడం, పార్టీ వర్కర్లకు అందుబాటులో లేకపోవడం వంటి విమర్శలు ఎదుర్కొన్నారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని గాంధీ కుటుంబ సభ్యుడు సందర్శించడం ఇదే మొదటిసారి. తన 55వ పుట్టినరోజు (జూన్ 19)న పార్టీ జాతీయ కార్యాలయానికి వచ్చి నేతలు, కార్యకర్తల మధ్య జరుపుకొన్నారు. గతంలో రాహుల్ పుట్టినరోజు విదేశాల్లోనే గడుపుతారన్న విమర్శలు ఉండేవి.

 2022-23లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన 4,000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ఆయన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. 2024 ప్రారంభంలో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రాహుల్‌లోని నిజమైన లీడర్‌ను పరిచయం చేసింది.

ఏప్రిల్‌లో రాహుల్ బిహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో చురుగ్గా పర్యటించారు. బిహార్‌లో సంవిధాన్ సురక్ష సమ్మేళన్లో పాల్గొనడమే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. గుజరాత్‌లో జిల్లా యూనిట్ల పునర్నిర్మాణ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో పాల్గొన్నారు.మే నెలలో, ఆయన పాట్నా వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. ‘ఫూలేసినిమాను పారిశ్రామికవేత్తలు, వెనుకబడిన వర్గాల ప్రముఖులతో కలిసి చూశారు. జూన్ నుంచి ఆయన సంస్థాగత వ్యవహారాల్లో దూసుకుపోతున్నారు. మధ్యప్రదేశ్, హర్యానాలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులను కలిశారు.

అంతేకాదు రాహుల్ ఇప్పుడు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై మరింత తీవ్రంగా దృష్టి సారించారు. గతంలో కేవలం బహిరంగ సభలు ఉండేవి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా, రాష్ట్ర సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్దిష్ట సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన మాటలతో కాదు చేతలతోనే తానెంత నిజమైన నిజాయితీ గల నాయకుడో చెబుతున్నారు. జనం కోసం జనంలోకి వెళుతూ జననాయకుడుగా గుర్తింపు పొందుతున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ 2.O వెర్షన్ అధికార బీజేపీని కూడా కాస్త కలవరపరుస్తూనే ఉందన్న వాస్తవాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే.

Exit mobile version